Lay Off: మైక్రోసాఫ్ట్‌లో నేటి నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రారంభం

ABN , First Publish Date - 2023-01-18T08:24:30+05:30 IST

ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది....

Lay Off: మైక్రోసాఫ్ట్‌లో నేటి నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రారంభం
Microsoft Lay Off Start

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది.(Microsoft) మైక్రోసాఫ్ట్ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్ నుంచి బుధవారం నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రారంభించింది.కంప్యూటర్ పరిశ్రమ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ బుధవారం నుంచి ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది.(Start Laying Off Employees) ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు స్టాల్వార్ట్స్ సేల్స్‌ఫోర్స్, అమెజాన్ కంపెనీలు ఇటీవల ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి.పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించాయి.

ఖర్చులను తగ్గించుకునేందుకు అమెజాన్ ఇప్పటికే 18వేలమంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది.ఫేస్‌బుక్-యజమాని మెటా వంటి దిగ్గజ సంస్థలు కూడా లేఆఫ్ ప్రకటించింది. యూరప్ అమెజాన్ కంపెనీలో జనవరి 18వతేదీ నుంచి ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని ఆ సంస్థ సీఈఓ ఆండీ జాస్సీ చెప్పారు. స్నాప్ చాట్ 1200 మంది ఉద్యోగులను తొలగించింది.ట్విట్టర్‌ను బిలియనీర్ ఎలోన్ మస్క్ అక్టోబర్‌లో కొనుగోలు చేశాక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లోని 7,500 మంది ఉద్యోగుల్లో సగం మందిని తొలగించారు.

Updated Date - 2023-01-18T08:38:44+05:30 IST