Meta Layoffs: మెటాలో లేఆఫ్‌లు...టాప్ ఎగ్జిక్యూటివ్‌ల తొలగింపు

ABN , First Publish Date - 2023-05-26T11:11:32+05:30 IST

ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటా మూడవ విడత లేఆఫ్‌లు ప్రకటించింది.ప్రపంచవ్యాప్తంగా మెటాలో 6వేలమంది ఉద్యోగులను తొలగించనుంది. దీనిలో భాగంగా భారతదేశంలోని మెటా ఉద్యోగులపై లే ఆఫ్ ప్రభావం పడింది...

Meta Layoffs: మెటాలో లేఆఫ్‌లు...టాప్ ఎగ్జిక్యూటివ్‌ల తొలగింపు
Meta Layoffs

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటా మూడవ విడత లేఆఫ్‌లు ప్రకటించింది.ప్రపంచవ్యాప్తంగా మెటాలో 6వేలమంది ఉద్యోగులను తొలగించనుంది. దీనిలో భాగంగా భారతదేశంలోని మెటా ఉద్యోగులపై లే ఆఫ్ ప్రభావం పడింది.(Meta Layoffs)మెటా ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ అవినాష్ పంత్, మీడియా భాగస్వామ్యాల డైరెక్టర్ సాకేత్ ఝా సౌరభ్,మెటా ఇండియా లీగల్ డైరెక్టర్ అమృతా ముఖర్జీతో సహా భారతదేశంలోని కొంతమంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు పదవీవిరమణ చేయవలసిందిగా యాజమాన్యం కోరినట్లు తెలిసింది.(Top Executives In India)మెటాలో చేరడానికి ముందు హాట్‌స్టార్‌లో లీగల్ టీమ్‌కు నాయకత్వం వహించిన అమృతా ముఖర్జీని తొలగించారు.మెటా వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన మార్క్ జుకర్‌బర్గ్ గతంలో మార్చిలో కంపెనీలో రెండు విడతల తొలగింపుల ద్వారా 10,000 ఉద్యోగాలను తొలగిస్తుందని ప్రకటించారు. మెటా మార్కెటింగ్, సైట్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ ఇంజనీరింగ్, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్, కంటెంట్ స్ట్రాటజీ, కార్పొరేట్ కమ్యూనికేషన్‌లు వంటి టీమ్‌లలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులను తొలగించారు.

Updated Date - 2023-05-26T11:17:13+05:30 IST