International Women's Day: వండర్‌లా వన్ ప్లస్ వన్ ఆఫర్

ABN , First Publish Date - 2023-03-02T20:16:25+05:30 IST

దేశంలోని అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్కులలో ఒకటైన వండర్‌లా హాలీడేస్(Wonderla

International Women's Day: వండర్‌లా వన్ ప్లస్ వన్ ఆఫర్

హైదరాబాద్: దేశంలోని అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్కులలో ఒకటైన వండర్‌లా హాలీడేస్(Wonderla Holidays) అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) కోసం సిద్ధమైంది. ఈ నెల 8న విమెన్స్‌డేను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఆ రోజున మహిళల కోసం ప్రత్యేకంగా తెరవనున్నారు. వారు తమ స్నేహితులతో కలిసి వినోదం, సాహసంతో కూడిన అద్వితీయ అనుభవాలను సొంతం చేసుకునే అవకాశాన్ని వండర్‌లా అందిస్తోంది.

ఇందులో భాగంగా వన్ ప్లస్ వన్ ఆఫర్‌ను ప్రకటించింది. అంటే రూ. 1,199 టికెట్ (జీఎస్టీతో కలిపి) టికెట్ కొంటే మరో టికెట్‌ను ఉచితంగా పొందొచ్చు. ఆన్‌లైన్‌లోనే మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. అది కూడా మొదటి 1000 టికెట్లకు మాత్రమే పరిమితం. కాగా, మహిళా దినోత్సవం నాడు పురుషులకు ఎలాంటి ప్రవేశం లేదు. అయితే, పదేళ్లలోపు పిల్లలను మాత్రం అనుమతిస్తారు. మార్చి 8 కోసం ఇప్పటికే బుక్ చేసుకున్న పురుషులకు టికెట్లను క్యాన్సిల్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

అలాగే, వన్ ప్లస్ వన్ బఫే ఆఫర్‌ను రూ.699కే అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ తొలి 500 బుకింగ్స్‌కు మాత్రమే. ఆ రోజున థ్రిల్లింగ్‌ రైడ్స్‌తో పాటుగా లైవ్‌ డీజే, పోటీలు, ఫుడ్‌ స్టాల్స్‌‌తోపాటు మరెన్నో అందుబాటులో ఉంచడం ద్వారా ఆ రోజును మరింత ఉత్సాహంగా మార్చనుంది.

ఈ సందర్భంగా వండర్‌లా హాలీడేస్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ కే చిట్టిలాపిళ్లి మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న తమ పార్కులు అన్నింటిలో మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. ఆ రోజున ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్టు తెలిపారు.

Updated Date - 2023-03-02T20:16:25+05:30 IST