Share News

Avoid Financial Mistakes: 2024లో ఈ 5 తప్పులు చేయకండి..మీ డబ్బును ఆదా చేసుకోండి!

ABN , Publish Date - Dec 29 , 2023 | 05:13 PM

కొత్త సంవత్సరం వస్తుంది. ఈ నేపథ్యంలో ఇకనైనా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ఐదు తప్పులను చేయకుండా ఉంటే మీరు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటారని తెలిపారు.

Avoid Financial Mistakes: 2024లో ఈ 5 తప్పులు చేయకండి..మీ డబ్బును ఆదా చేసుకోండి!

మనీ మనీ మనీ. ప్రస్తుతం అనేక మంది మధ్య తరగతి ప్రజల్లో ఉండే ప్రధాన సమస్య. ఏది కొనాలన్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకుంటారు. అయినప్పటికీ తీసుకున్న వస్తువులకు ఈఎంఐలు, లోన్స్ రూపంలో డబ్బులు చెల్లిస్తూ పలు రకాల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే వచ్చే ఏడాది అంటే 2024 కొత్త సంవత్సరంలోనైనా ఆర్థిక క్షమశిక్షణ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు తరుచుగా చేసే ఈ ఐదు తప్పులను చేయకుండా ఉంటే ఆర్థిక సమస్యలకు దూరంగా ఉండవచ్చని అంటున్నారు. అయితే అవేంటో ఇప్పుడు చుద్దాం.


1. సంపాదన కంటే ఖర్చు ఎక్కువ

ప్రస్తుతం అనేక మంది క్రెడిట్ కార్డుల పుణ్యామా అని పరిమితికి మించి ఖర్చు చేస్తున్నారు. అంతేకాదు వారికి వచ్చే జీతం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండటం కూడా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక క్రమశిక్షణ కోసం 50:30:20 రూల్ పాటించాలని స్పష్టం చేశారు. వచ్చే మొత్తం జీతంలో 50% నిత్యావసరాలకు, 30% కోరికలకు, 20% పొదుపులకు కేటాయించాలని చెప్పారు. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా ప్రతి నెల పాటిస్తే ఆర్థిక భారం నుంచి తప్పించుకోవచ్చని అన్నారు.

2. మీకు ఏం కావాలో తెలుసుకోండి

అనేక మంది ఏదైనా షాపింగ్ కోసం వెళ్లినా లేదా ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు వెళ్తే అనుకున్న దానికంటే ఎక్కువగా షాపింగ్ చేస్తారు. అలాంటి వాటి విషయంలో చాలా కఠినంగా ఉండాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మీకు ఏది కావాలో కేవలం దానిని మాత్రమే తీసుకుని రావాలని చెబుతున్నారు. ఒకవేళ కొనుగోలు చేయాలని అనిపిస్తే మీ ఖర్చులు, ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని తీసుకోవాలని అంటున్నారు. అలా చేయడం వల్ల మీ ఖర్చు అదుపులో ఉండటంతోపాటు మీ డబ్బు కూడా నియంత్రణలో ఉంటుంది.

3. పొదుపు చేసిన మొత్తానికి దూరం

ప్రతి ఒక్కరి ఆర్థిక భవిష్యత్తుకు పొదుపు తప్పనిసరి. అయితే దీనిని అనేక మంది అవలంభిస్తారు. బైక్, ఇళ్లు సహా పలు వస్తువులు కొనాలని సేవ్ చేస్తారు. కానీ దానిని అనుకున్న లక్ష్యం మేరకు పూర్తే చేసే వారు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. అలా పొదుపు చేసిన మొత్తాన్ని చిన్న చిన్న ఖర్చుల కోసం ఉపయోగించకూడదని నిపుణులు అంటున్నారు. అంతేకాదు మరి అత్యవసరం, ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే తప్ప వాటిని తీయకూడదని చెబుతున్నారు.

4. పెట్టుబడి తప్పనిసరి

మన దేశంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారి శాతం చాలా తక్కువ అని చెప్పవచ్చు. కానీ విదేశాల్లో మాత్రం ఎక్కువ మంది ఈ రంగంలో పెట్టుబడులు పెడుతుంటారు. అలాంటి అలవాట్లను మనం కూడా పాటించి మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓ, పోస్టాఫీస్ స్కీమ్స్, పాలసీలు సహా పలు రంగాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని పెట్టుబడులు పెట్టాలి. అలా చేయడం ద్వారా భవిష్యత్తులో మీరు డబ్బును పెంచుకునే మార్గాలను పెంచుకోవచ్చు.

5. పదవి విరమణ కోసం ప్లానింగ్

ప్రతి ఒక్కరూ కూడా వారి ఉద్యోగాల పదవి విరమణ సమాయం వరకు తప్పనిసరిగా కొంత సేవ్ చేసుకోవాలి. అలా చేయడం ద్వారా ఎవరిపై ఆధారపడకుండా స్వేచ్ఛగా జీవించవచ్చు. దీంతోపాటు కుమారులు, కుమార్తెల పై కూడా డిపెండ్ కావాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ఎవరు తల్లిదండ్రలను ఆదుకుంటారో ఎవరు ఆదుకోరో తెలియడం లేదు.

Updated Date - Dec 29 , 2023 | 05:20 PM