Share News

Neville Roy Singham: అమెరికన్ మిలియనీర్ నెవిల్లే రాయ్‌కి ఈడీ సమన్లు

ABN , First Publish Date - 2023-11-16T13:21:09+05:30 IST

‘న్యూస్‌క్లిక్ టెర్రర్ కేసు’లో (NewsClick terror Case) వ్యాపారవేత్త, అమెరికన్ మిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్‌కు ఈడీ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది. భారత్‌లో చైనా అనుకూల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Neville Roy Singham: అమెరికన్ మిలియనీర్ నెవిల్లే రాయ్‌కి ఈడీ సమన్లు

న్యూఢిల్లీ: ‘న్యూస్‌క్లిక్ టెర్రర్ కేసు’లో (NewsClick terror Case) వ్యాపారవేత్త, అమెరికన్ మిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్‌కు ఈడీ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది. భారత్‌లో చైనా అనుకూల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సింఘమ్ ప్రస్తుతం చైనాలోని షాంఘైలో ఉన్నారని వివరించాయి. సింఘమ్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయాలంటూ స్థానిక కోర్టు ఎల్ఆర్ (Letters Rogatory) జారీ చేయడంతో ఈ తాజా సమన్లు పంపించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మనీల్యాండరింగ్ నిరోధక చట్టం(PMLA) నిబంధనల కింద తాజా సమన్లు జారీ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ-మెయిల్ ద్వారా నోటీసులు పంపినట్టు వెల్లడించాయి. విదేశాంగ మంత్రిత్వశాఖ సహాయంతో చైనా ప్రభుత్వ మార్గాల ద్వారా ఈ నోటీసులు పంపించింది. కాగా సింఘమ్‌కు ఈడీ నోటీసులు జారీ చేయడం ఇది రెండోసారి. 2021లో విచారణ ప్రారంభమవ్వగా తొలిసారి 2022లో ఈడీ నోటీసులు జారీ చేసింది.


కాగా కొన్ని నెలలక్రితం సింఘమ్ వార్తల్లో నిలిచారు. న్యూయార్క్ టైమ్స్‌లో వెలువడిన ఓ కథనం ఆధారంగా ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఈడీ అందించిన ఆధారం కూడా ఉండడంతో సింఘమ్‌తోపాటు న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ‘న్యూస్‌క్లిక్’ అనేది గ్లోబల్ నెట్‌వర్క్ అని, దీనికి సింఘమ్ నుంచి నిధులు అందుతాయని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. సింఘమ్‌కి చైనా ప్రభుత్వ మీడియా యంత్రాంగంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొంది.

Updated Date - 2023-11-16T13:21:10+05:30 IST