Earn Money on Twitter: ఇక ట్విట్టర్‌లోనూ డబ్బులు సంపాదించేయండి.. ఎలాన్ మస్క్ బ్రహ్మాండమైన ఆఫర్!

ABN , First Publish Date - 2023-04-14T16:33:03+05:30 IST

అటెన్షన్ ప్లీజ్! మీరు ట్విట్టర్ యూజర్లు (Twitter Users) అయితే ఇది మీ కోసమే.

Earn Money on Twitter: ఇక ట్విట్టర్‌లోనూ డబ్బులు సంపాదించేయండి.. ఎలాన్ మస్క్ బ్రహ్మాండమైన ఆఫర్!

న్యూఢిల్లీ: అటెన్షన్ ప్లీజ్! మీరు ట్విట్టర్ యూజర్లు (Twitter Users) అయితే ఇది మీ కోసమే. ఆ సంస్థ సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) ఓ అద్భుత ప్రకటన చేశారు. మీరు క్రియేటర్లు అయితే కనుక ఇకపై యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లానే ట్విట్టర్‌లోనూ డబ్బులు సంపాదించుకోవచ్చు. అందుకోసం మస్క్ మానిటైజేషన్ ప్లాన్‌ను ప్రకటించారు.

ఇన్‌-థ్రెండ్ యాడ్స్‌తో క్రియేటర్లు ఆదాయం ఆర్జించవచ్చు. అయితే, ఈ ప్రయోజనాలు పొందాలంటే మాత్రం యూజర్ బ్లూ టిక్ (Twitter Blue Tick) సబ్‌స్క్రిప్షన్‌ను పొందాల్సి ఉంటుంది. ట్విట్టర్‌లో షేర్ చేసే లాంగ్‌ఫామ్ కంటెంట్, ఇమేజ్‌లు, వీడియోలకు మాత్రమే సబ్‌స్క్రిప్షన్ పనిచేస్తుందని మస్క్ ప్రకటించారు.

నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రుసుము 8 పౌండ్లు చెల్లించే వారి ట్వీట్లను మాత్రమే ప్లాట్‌ఫామ్‌లోని ‘ఫర్ యూ’ టైమ్‌లైన్ ప్రమోట్ చేస్తుందని మస్క్ గతంలో పేర్కొన్నారు. అయితే, దీనిపై విమర్శలు రావడంతో వెంటనే వెనక్కి తగ్గారు. ‘ఫర్‌ యూ’ పెయిడ్ ఖాతాలకే పరిమితం కాకుండా చూసుకున్నారు.

యూ ట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ వంటి పోటీ సంస్థలతో పోలిస్తే ట్విట్టర్ ప్రస్తుతం పరిమితంగా మాత్రమే మానిటైజేషన్ ఆప్షన్లను అందిస్తోంది. అయితే, ఇది ఆరంభం మాత్రమే కావడంతో మస్క్ మాస్టర్ ప్లాన్ గురించి యూజర్లు ఎదురు చూడక తప్పదు.

Updated Date - 2023-04-14T16:34:27+05:30 IST