Gold: బంగారం మోసాలకు ఇలా చెక్ పెట్టండి

ABN , First Publish Date - 2023-04-22T15:56:35+05:30 IST

: ఓ వైపు బంగారం (Gold) ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

Gold: బంగారం మోసాలకు ఇలా చెక్ పెట్టండి

హైదరాబాద్: ఓ వైపు బంగారం (Gold) ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అదే సమయంలో చెల్లించే సొమ్ముకు తగిన స్వచ్ఛత కలిగిన బంగారు ఆభరణాలు పొందడంలో కొనుగోలు దారులు మోసపోకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బీఐఎస్ కేర్ యాప్ (BIS CARE APP)ను విడుదల చేసింది. వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లలో యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఆభరణంపై స్కాన్ చేసి నగలపై ఉండే హెచ్‌యూఐడీ (HUID) నంబర్ అసలుదో కాదో ధృవీకరించుకోవచ్చు.

GOLD1.jpg

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒకరోజు పెరిగితే.. మరొక రోజు తగ్గుతుంటాయి. ధరల్లో హెచ్చుతగ్గులు సర్వసాధారణం. అసలే పెళ్లిళ్ల సీజన్.. బంగారం, వెండి రేటు పెరిగినా కూడా కొనక తప్పని పరిస్థితి. ఇక నేడు అక్షయ తృతీయ కూడా కావడంతో కొనుగోళ్లు బీభత్సంగానే ఉంటాయి. అయితే ధర కాస్త తగ్గితే హ్యాపీగా ఫీలవుతుంటారు.

ఇక ఈ నెలలో వెండి, బంగారం ధరలు మాత్రం విపరీతంగా పెరిగాయి. ఇక ముందే అనుకున్నాం.. పెరిగితేనేమో రూ.500 పైనే.. తగ్గితేనేమో పదుల సంఖ్యలో. ఇక అవన్నీ కాదంటే స్థిరంగా ఉంటుంది. నిన్నటి నుంచి బంగారం ధరలో ఎలాంటి మార్పూ లేదు. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 60,930కి చేరుకుంది. ఇక వెండి ధర మాత్రం రూ.700 తగ్గింది. కిలో వెండి ధర రూ.76,900 ఉంది.

Updated Date - 2023-04-22T16:26:15+05:30 IST