iPhones: చరిత్రలో తొలిసారి మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్స్ విక్రయించనున్న యాపిల్ సంస్థ

ABN , First Publish Date - 2023-09-12T16:49:19+05:30 IST

చరిత్రలో తొలిసారి యాపిల్ సంస్థ ఐఫోన్ లాంచ్ రోజున మేడ్-ఇన్-ఇండియా ఫోన్లను విక్రయించనుంది. భారత్ నిర్మించిన ఐఫోన్ 15 మోడల్స్‌ని దక్షిణాసియా దేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో అందుబాటులోకి..

iPhones: చరిత్రలో తొలిసారి మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్స్ విక్రయించనున్న యాపిల్ సంస్థ

చరిత్రలో తొలిసారి యాపిల్ సంస్థ ఐఫోన్ లాంచ్ రోజున మేడ్-ఇన్-ఇండియా ఫోన్లను విక్రయించనుంది. భారత్ నిర్మించిన ఐఫోన్ 15 మోడల్స్‌ని దక్షిణాసియా దేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురావాలని ఆ సంస్థ యోచిస్తోంది. నిజానికి.. ఐఫోన్ 15 మోడల్స్‌ ఎక్కువ భాగం చైనా నుంచి వచ్చినప్పటికీ.. ఇండియన్-అసెంబుల్డ్ డివైజ్‌లు తొలిరోజు విక్రయానికి రావడం ఇదే మొదటిసారి అని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇది భారతదేశపు ఉత్పత్తి నైపుణ్యాన్ని చాటి చెప్తుందని వాళ్లు పేర్కొంటున్నారు. ఈ కొత్త ఐఫోన్ 15 ఆవిష్కరించబడిన కొన్ని రోజులు లేదా వారాల్లో అమ్మకానికి వస్తుందని సమాచారం. క్యూపర్టినో.. కాలిఫోర్నియాకు చెందిన ఈ యాపిల్ సంస్థ గత నెలలో తమిళనాడు రాష్ట్రంలోని ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఫ్యాక్టరీలో ఐఫోన్ 15 ఉత్పత్తిని ప్రారంభించింది. భారతదేశ కార్యకలాపాలు, చైనాలోని ప్రధాన ఉత్పాదక స్థావరాల మధ్య అంతరాన్ని తగ్గించడంలో భాగంగా.. యూఎస్ టెక్ దిగ్గజం చేసిన మరో ప్రయత్నం ఇది.

మరోవైపు.. యాపిల్ సంస్థ యూఎస్‌లోని తన ప్రధాన కార్యాలయంలో జరిగే గాలా ఈవెంట్‌లో ఐఫోన్ 15, అప్డేటెడ్ వాచెస్, ఎయిర్‌పాడ్‌లను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రారంభోత్సవం జరిగిన 10 తర్వాత కొత్త ప్రోడక్టుల అమ్మకాలు మొదలవుతాయి. స్థానిక తయారీని పెంపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక ప్రోత్సాహకాలు అందించారు. ఇక ఐఫోన్ 15 కొత్త మోడల్ విషయానికొస్తే.. గత మూడేళ్లలో ఈ కొత్త ఐఫోన్ బిగ్గెస్ట్ అప్డేట్‌గా రానుంది. ఇది కెమెరా సిస్టమ్‌కు అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుంది. ప్రో మోడల్‌లు మెరుగైన 3-నానోమీటర్ ప్రాసెసర్‌తో వస్తున్నాయి.

Updated Date - 2023-09-12T16:49:19+05:30 IST