Giridhar Reddy: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరోక్ష విమర్శలు
ABN , First Publish Date - 2023-07-22T18:58:50+05:30 IST
వైసీపీ ప్రభుత్వంపై (YCP Govt) టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి (TDP leader Kotamreddy Giridhar Reddy) పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
నెల్లూరు: వైసీపీ ప్రభుత్వంపై (YCP Govt) టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి (TDP leader Kotamreddy Giridhar Reddy) పరోక్షంగా విమర్శలు గుప్పించారు. జీజీహెచ్‌లో రోగులు మృతి చెందడం దురదృష్టమని, రోగులు చనిపోవడంపై పలు సందేహాలు కలుగుతున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఈ సంఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గతంలో కరోనా సమయంలో రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహించారు. ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదంటూ వైసీపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.