Share News

Eluru: ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2023-10-23T08:16:35+05:30 IST

ఏలూరు: ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. 26న స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం, 27న రథోత్సవం, 29న రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Eluru: ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు

ఏలూరు: ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. 26న స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం, 27న రథోత్సవం, 29న రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో స్వామి వారికి జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

కాగా ద్వారకాతిరుమల కుంకుళ్లమ్మ ఆలయంలో 9వ రోజు సోమవారం ఘనంగా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉదయం శ్రీ మహిషాసుర మర్దినిగా, మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరణలో కుంకుళ్లమ్మ భక్తులకు దర్శనమిస్తారు.

Updated Date - 2023-10-23T08:16:35+05:30 IST