విద్యుత్‌ చార్జీలు తగ్గించాలి

ABN , First Publish Date - 2023-03-28T00:14:34+05:30 IST

ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమకు పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని గరివిడి సీఐటీయూ నాయకులు ఎ.గౌరునాయుడు డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ చార్జీలు తగ్గించాలి
ఆందోళన చేస్తున్న సీఐటీయూ నాయకులు

గరివిడి: ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమకు పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని గరివిడి సీఐటీయూ నాయకులు ఎ.గౌరునాయుడు డిమాండ్‌ చేశారు. గరివిడి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం ఫేకర్‌ కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమకు యూనిట్‌ విద్యుత్‌ రూ.4.90 పైసలకు సరఫరా చేసిందని, రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిని రూ5.90 పైసలకు పెంచారని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా ఆదివారం ఈఆర్‌సీ చైౖర్మన్‌ సీవీ నాగార్జున రెడ్డి, ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమకు సరఫరా చేసిన విద్యుత్‌కు అదనంగా ఎండీ ఛార్జీలు (ట్రాన్స్‌ఫోర్టు ఖర్చు) వేస్తున్నట్లు ప్రకటించారన్నారు. దీనివల్ల ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమకు ఒక యూనిట్‌ విద్యుత్‌ సరఫరా చేసుకునేందుకు పరిశ్రమలకు రూ7.86 పైసలు ఖర్చు అవుతుందని వివరించారు. దీనివలన పరిశ్రమలు మూతపడే అవకాశం ఉందని గౌరునాయుడు తన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ చార్జీల ఆధారంగా నడిచే ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమలు జిల్లాలో 10 ఉన్నాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా జిల్లాలో 60 వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్‌ కార్యాలయంలో విపతిపత్రం అందించారు. కార్యక్రమంలో కార్మికులు జి.సత్తిరాజు, రామారావు, ఉత్తరావిల్లి ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. ఫోటో

Updated Date - 2023-03-28T00:14:34+05:30 IST