Share News

Panchakarla Ramesh:జన సైనికుల్లో నూతనోత్సాహం నింపిన పంచకర్ల రమేష్

ABN , First Publish Date - 2023-11-05T20:56:21+05:30 IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పంచకర్ల రమేష్(Panchakarla Ramesh)కి బాధ్యతలు అప్పగించారు. జిల్లా రాజకీయాల్లో తన మార్క్ ని చూపిస్తున్న పంచకర్లకు ఇవాళ పార్టీ నేతలు పరవాడలో ఘనస్వాగతం పలికారు.

Panchakarla Ramesh:జన సైనికుల్లో నూతనోత్సాహం నింపిన పంచకర్ల రమేష్

పరవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పంచకర్ల రమేష్(Panchakarla Ramesh)కి బాధ్యతలు అప్పగించారు. జిల్లా రాజకీయాల్లో తన మార్క్ ని చూపిస్తున్న పంచకర్లకు ఇవాళ పార్టీ నేతలు పరవాడలో ఘనస్వాగతం పలికారు. ఆయన సమక్షంలో వైసీపీ(YSRCP) నుంచి భారీగా నేతలు జనసేనలో చేరారు. దేశపత్రునీ పాలెంలో మొదలైన పంచకర్ల ర్యాలీ(Bike Rally) పరవాడ మీదుగా లంకెలపాలెం నుంచి సబ్బవరానికి చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో పంచకర్ల ప్రసంగించారు. సభ అనంతరం నేరుగా విశాఖ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్(Hyderabad)కి ప్రయాణం అయ్యారు. ఇవాళ్ల ఆయన నాగబాబు కుమారుడు హీరో వరుణ్ తేజ్ రిసెప్షన్ కు హాజరుకానున్నారు.

Updated Date - 2023-11-05T20:57:41+05:30 IST