Visakha: ఆర్కే బీచ్‌లో టీడీపీ నేతల వినూత్న నిరసన..

ABN , First Publish Date - 2023-09-22T15:56:25+05:30 IST

విశాఖ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ విశాఖ ఆర్కే బీచ్‌లో టీడీపీ నేతలు వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. ఇసుకలో అర్ధ సమాధి చేసుకున్న నేతలు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Visakha: ఆర్కే బీచ్‌లో టీడీపీ నేతల వినూత్న నిరసన..

విశాఖ: టీడీపీ అధినేత (TDP Chief) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అక్రమ అరెస్టును నిరసిస్తూ విశాఖ ఆర్కే బీచ్‌ (Visakha RK Beach)లో టీడీపీ నేతలు (TDP Leaders) వినూత్నరీతి (Innovative)లో నిరసన (Protest) చేపట్టారు. ఇసుకలో అర్ధ సమాధి చేసుకున్న నేతలు జగన్ ప్రభుత్వానికి (Jagan Govt.) వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరసన చేపట్టిన టీడీపీ నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ... అంబేద్కర్ రాజ్యాంగాన్ని (Ambedkar Constitution) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) సజీవ సమాధి చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని సజీవ సమాధి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డని అన్నారు. సీఎం ఒక సైకో అని, లక్ష కోట్ల రూపాయలు దోపిడీ చేసి.. 32 కేసుల్లో ప్రధాన ముద్దాయని, 16 నెలలు జైల్లో ఉండి..బైయిల్‌పై తిరుగుతున్న వ్యక్తి అని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో వేశారని నేతలు మండిపడ్డారు.

మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill development Case) అక్రమ అరెస్ట్‌ను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును (AP High Court) ఆశ్రయించిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు నిరాశ ఎదురైంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్ట్ కొట్టివేసింది. సీఐడీ తరుపు లాయర్లతో జడ్జి ఏకీభవించారు. పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు ఏక వాఖ్యంతో కోర్టు తీర్పునిచ్చింది.

ఏపీ హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని టీడీపీ నిర్ణయించింది. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2023-09-22T15:56:25+05:30 IST