Chinarajappa: చంద్రబాబు, పవన్ భేటీలో చర్చకు వచ్చిన అంశాలేంటో చెప్పిన చినరాజప్ప
ABN , Publish Date - Dec 18 , 2023 | 09:45 AM
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీలో మొత్తం రెండు అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయని మాజీ మంత్రి చినరాజప్ప తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులు ,ఉమ్మడి మేనిఫెస్టోపై సుదీర్ఘంగా చర్చించారన్నారు.
విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) భేటీలో మొత్తం రెండు అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయని మాజీ మంత్రి చినరాజప్ప (Former Minister Chinarajappa) తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులు ,ఉమ్మడి మేనిఫెస్టోపై సుదీర్ఘంగా చర్చించారన్నారు. పొత్తులపై ఇప్పటికే పార్టీ అధిష్టాన నేతలు ఒక అవగాహనకు వచ్చారన్నారు. జనసేనకు బలం, గెలిచే అవకాశంలో చోటే సీట్లు ఇచ్చే దశగా ఆలోచనలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో జనంలోకి వెళ్ళిందని తెలిపారరు. జనసేన సూచించిన మరికొన్ని అంశాలతో కలిపి త్వరలోనే పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. రాయలసీమ లేదా గుంటూరు కృష్ణా జిల్లాలో భారీ బహిరంగ సభ ద్వారా మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. ఇప్పటికే పలుమార్లు జరిగిన భేటీలో పలు కీలక అంశాలపై ఇరు పార్టీలు అవగాహనకు వచ్చాయని చినరాజప్ప వెల్లడించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...