ముగిసిన జీ-20 సదస్సు

ABN , First Publish Date - 2023-03-31T03:40:53+05:30 IST

విశాఖపట్నంలో జీ-20 సభ్యదేశాల వర్కింగ్‌ గ్రూపు సదస్సు గురువారం ముగిసింది.

ముగిసిన జీ-20 సదస్సు

కెపాసిటీ బిల్డింగ్‌పై ప్రతినిధులకు అవగాహన

ఉత్తమ ప్రాజెక్టులపై సింగపూర్‌, దక్షిణ కొరియా వివరణ

తదుపరి సదస్సు రిషీకేశ్‌లో

విశాఖపట్నం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో జీ-20 సభ్యదేశాల వర్కింగ్‌ గ్రూపు సదస్సు గురువారం ముగిసింది. చివరి రోజు సభ్యదేశాల ప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సింగపూర్‌, దక్షిణ కొరియా దేశాల ప్రతినిధులు వారు అమలు చేస్తున్న ఉత్తమ ప్రాజెక్టుల అనుభవాలను వివరించారు. వ్యర్థ జలాల నిర్వహణ, సమీకృత మాస్టర్‌ ప్లాన్‌లపై సింగపూర్‌కు చెందిన నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జనరల్‌ అహ్‌టాన్‌ లోహ్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. స్థానిక సంస్థలకు ఆర్థిక వనరుల సమీకరణ చాలా కీలకమని, ప్రైవేటు సంస్థల నుంచి కూడా సమీకరించుకోవచ్చనని వక్తలు వెల్లడించారు. జీ-20 తదుపరి సదస్సు జూన్‌ 26-28 మధ్య ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్‌లో జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. అనంతరం ప్రతినిధులంతా మహా విశాఖ నగర పాలక సంస్థ ముడసర్లోవ పార్కులో ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్‌ సోలార్‌ పవర్‌ ప్లాంటును, కాపులుప్పాడలో జిందాల్‌ సంస్థ నిర్వహిస్తున్న వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టును పరిశీలించారు.

Updated Date - 2023-03-31T03:40:53+05:30 IST