Udayagiri MLA Mekapatiకి అస్వస్థత.. అపోలోకి తరలింపు

ABN , First Publish Date - 2023-02-08T13:42:42+05:30 IST

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

Udayagiri MLA Mekapatiకి అస్వస్థత.. అపోలోకి తరలింపు

నెల్లూరు: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (Udayagiri MLA Mekapati Chandrasekhar Reddy) అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం నెల్లూరు (Nellore)లోని అపోలో ఆసుపత్రి (Apollo Hospital)కి తరలించారు. వైద్యులు గుండెకు సంబంధించి పరీక్షలు నిర్వహించారు. మరికొన్ని వైద్య పరీక్షలు చేసేందుకు చెన్నై (Chennai)కి తరలించే అవకాశం ఉంది. గుండెలో రెండు వాల్వ్‌లు మూసుకుపోయినట్టు సమాచారం. వైద్యులు సైతం చెన్నై తీసుకువెళ్లాలని సూచించినట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-02-08T13:42:44+05:30 IST