Share News

Train accident: రైలు ప్రమాద ఘటనలో 11కు చేరిన మృతుల సంఖ్య

ABN , First Publish Date - 2023-10-30T07:29:26+05:30 IST

రైలు ప్రమాద ఘటన వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ రైల్వే క్విక్ రెస్పాన్స్ టీం అగ్నిమాపక సిబ్బంది.. సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు. మరో మూడు మృతదేహాలు లోపల ఇరుక్కున్నట్లు సిబ్బంది గుర్తించింది.

Train accident: రైలు ప్రమాద ఘటనలో 11కు చేరిన మృతుల సంఖ్య

విజయనగరం : రైలు ప్రమాద ఘటన వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ రైల్వే క్విక్ రెస్పాన్స్ టీం అగ్నిమాపక సిబ్బంది.. సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు. మరో మూడు మృతదేహాలు లోపల ఇరుక్కున్నట్లు సిబ్బంది గుర్తించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నుజ్జునుజ్జైన భోగిలను సిబ్బంది కట్ చేస్తోంది. ఇంతవరకూ ఆ మార్గంలో ట్రైన్ల పునరుద్ధరణ జరగలేదు. దీనికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాగా.. రైలు ప్రమాద స్ధలాన్ని ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్, మజ్జి శ్రీనవాసరావు, ఎమ్మెల్యే కడుబండి, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ సందర్శించారు.

విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి రైల్వేజంక్షన్‌ ( Kantakapalli Railway Junction ) దగ్గర రెండు రైళ్లు ఢీ కొన్నాయి. రాయగడ ప్యాసింజర్‌ ( Rayagada Passenger ) ను వెనుక నుంచి పలాస ప్యాసింజర్‌ ( Palasa Passenger ) ఢీకొంది. సిగ్నల్‌ కోసం ఆగిన ప్యాసింజర్‌ను పలాస ప్యాసింజర్‌ ఢీకొంది. పట్టాలు తప్పిన విశాఖ- రాయగడ ప్యాసింజర్‌ మూడు బోగీలు చెల్లాచెదురయ్యాయి. ఈ ప్రమాదంలో తొలుత 9 మంది మృతి చెందినట్టు వార్తలొచ్చాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Updated Date - 2023-10-30T08:18:22+05:30 IST