పెంపుడు కుక్కకు అంత్యక్రియలు

ABN , First Publish Date - 2023-03-05T21:35:33+05:30 IST

పెంపుడు కుక్క (Dog) మరణించడంతో అంత్యక్రియలను శాస్త్రోకంగా నిర్వహించి దాని పట్ల ప్రేమను చాటుకున్నాడు ఆ యజమాని. వివరాల్లోకి వెళితే గుంటూరుకు సమీపంలోని

పెంపుడు కుక్కకు అంత్యక్రియలు

గుంటూరు: పెంపుడు కుక్క (Dog) మరణించడంతో అంత్యక్రియలను శాస్త్రోకంగా నిర్వహించి దాని పట్ల ప్రేమను చాటుకున్నాడు ఆ యజమాని. వివరాల్లోకి వెళితే గుంటూరుకు సమీపంలోని పెదపలకలూరులో నివాసం ఉంటున్న చెరుకూరి వెంకటకృష్ణ నాలుగు సంవత్సరాలుగా కుక్కను పెంచుకోంటున్నాడు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అది కూడా ఆ కుటుంబంలో సభ్యునిగా మెలిగింది. అనారోగ్యం కారణంగా అది శనివారం మరణించడంతో దానికి కూడా మనుషులకు మాదిరిగానే శాస్త్రోకంగా అన్ని తంతగాలు పూర్తిచేసి అంత్యక్రియలు (funeral) నిర్వహించి దానిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. అంతేగాక పెంపుడు కుక్క కళేబరాన్ని వాహనంపై ఊరేగించి, దారి పొడువునా పూలను చల్లుతూ ఆదివారం ఉదయం అంతిమయాత్ర ఘనంగా నిర్వహించారు. అనంతరం తమ సొంత స్ధలంలో దానిని పూడ్చిపెట్టి అంత్యక్రియలను పూర్తిచేశారు. ఈ సందర్భంగా యజమాని చెరుకూరి వెంకటకృష్ణ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల కాలంలో పెంపుడు శునకం చూపిన ప్రేమ వెలకట్టలేనిదన్నాడు. అందుకే దానికి అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకున్నట్టు తెలిపారు.

Updated Date - 2023-03-05T21:35:33+05:30 IST