AP Govt: అప్పు మీద అప్పు.. తాజాగా ఏపీ సర్కార్ చేసిన అప్పు ఎంతంటే?

ABN , First Publish Date - 2023-08-22T15:48:36+05:30 IST

ఏపీ ప్రభుత్వం అప్పు మీద అప్పు చేస్తూనే ఉంది. మంగళవారం వచ్చిందంటే చాలు బాండ్ల వేలంలో రిజర్వ్ బ్యాంక్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లలో అప్పులు తీసుకుంటోంది. ఇప్పటికే సర్కార్ దాదాపు 33 వేల 500 కోట్ల రూపాయలు అప్పు రూపంలో తీసుకువచ్చింది. ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితికి మించి రూ.3 వేల కోట్లు అదనపు అప్పు చేసింది.

AP Govt: అప్పు మీద అప్పు.. తాజాగా ఏపీ సర్కార్ చేసిన అప్పు ఎంతంటే?

అమరావతి: ఏపీ ప్రభుత్వం (AP Government) అప్పు మీద అప్పులు చేస్తూనే ఉంది. మంగళవారం వచ్చిందంటే చాలు బాండ్ల వేలంలో రిజర్వ్ బ్యాంక్ (Reserver Bank) నుంచి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లలో అప్పులు తీసుకుంటోంది. ఇప్పటికే సర్కార్ దాదాపు 33 వేల 500 కోట్ల రూపాయలు అప్పు రూపంలో తీసుకొచ్చింది. ఎఫ్‌ఆర్‌బీఎం (FRBM) పరిమితికి మించి రూ.3 వేల కోట్లు అదనంగా అప్పు చేసింది. ఇప్పుడు తాజాగా మరోమారు వెయ్యి కోట్ల రూపాయలను అప్పుగా తీసుకువచ్చింది.


మంగళవారం జరిగిన బాండ్ల వేలంలో వెయ్యి కోట్లను 7.46 శాతం వడ్డీకి 15 సంవత్సరాలకు రుణం సేకరించింది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ వద్ద వేస్ అండ్ మీన్స్ కింద ఏపీ ప్రభుత్వం చేబదులు తీసుకుంది. ఈ క్రమంలో ఈ రోజు బాండ్ల ద్వారా సేకరించిన అప్పును తమకు ఇవ్వాల్సిన మొత్తంలో రిజర్వ్ బ్యాంక్ జమ చేసుకోనుంది. మరోవైపు ఆర్ధిక శాఖ అధికారులు అప్పు కోసం ఢిల్లీలో (New Delhi) కాళ్లు అరిగేలా తిరుగుతున్నప్పటికీ సరైన స్పందన కరువైంది. నేటి వరకూ కేంద్ర ప్రభుత్వం (Central Goverment) అదనపు రుణ పరిమితికి అవకాశం ఇవ్వని పరిస్థితి. ఎప్పటికప్పుడు వెయ్యి నుంచి రెండు వేల కోట్లు తాత్కాలిక అనుమతులు ఇస్తూ కేంద్రం కాలం గడపుతూ వస్తోంది.

Updated Date - 2023-08-22T15:55:22+05:30 IST