TDP: అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు అధ్వర్యంలో యువగళం విజయోత్సవ బైక్ ర్యాలీ
ABN , Publish Date - Dec 26 , 2023 | 03:02 PM
ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అధ్వర్యంలో యువగళం విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు.
శ్రీకాకుళం: ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అధ్వర్యంలో యువగళం విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. 10 వేలకు పైగా ద్విచక్ర వాహనాలతో కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.
కోటబొమ్మాళి నుంచి నందిగాం మండలం కాపుతెంబూరు వరకు ర్యాలీ నిర్వహించారు. సుమారుగా 6 కిలోమీటర్ల మేర పసుపు మయమైంది. కాపుతెంబూరు వేదికగా అచ్చెన్నాయుడు, రాంమోహన్ నాయుడు సమక్షంలో టీడీపీలో ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు చేరారు.