Share News

AP News: గన్నవరంలో అంగన్వాడీల నిరవధిక సమ్మెకు టీడీపీ మద్దతు

ABN , Publish Date - Dec 14 , 2023 | 03:05 PM

Andhrapradesh: గన్నవరంలో అంగన్వాడీల నిరవధిక సమ్మెకు టీడీపీ మద్దతు తెలిపింది. సీడీపీవో కార్యాలయం ఎదుట సమ్మెలో పార్టీ ఇన్ ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు.

AP News: గన్నవరంలో అంగన్వాడీల నిరవధిక సమ్మెకు టీడీపీ మద్దతు

కృష్ణా: గన్నవరంలో అంగన్వాడీల నిరవధిక సమ్మెకు టీడీపీ మద్దతు తెలిపింది. సీడీపీవో కార్యాలయం ఎదుట సమ్మెలో పార్టీ ఇన్ ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో వైసీపీ మీనమేషాలు లెక్కపెడుతోందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధినేత చంద్రబాబుతో మాట్లాడి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలను విస్మరించిందన్నారు. తెలుగునాడు అంగన్వాడీ సంఘ రాష్ట్ర, జిల్లా అధ్యక్షురాలు ఆచంట సునీత, పొదిలి లలిత తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 04:09 PM