Panchumarthi Anuradha: చంద్రబాబు అరెస్ట్‌తో వైసీపీకి కాలం చెల్లింది

ABN , First Publish Date - 2023-09-09T14:22:01+05:30 IST

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్ ప్రజాస్వామ్యానికి చీకటి రోజని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు.

Panchumarthi Anuradha: చంద్రబాబు అరెస్ట్‌తో వైసీపీకి కాలం చెల్లింది

అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడి (TDP Chief Chandrababu naidu) అక్రమ అరెస్ట్ ప్రజాస్వామ్యానికి చీకటి రోజని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (TDP MLC Panchumarthi Anuradha) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కుట్రతో అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో వైసీపీకి కాలం చెల్లిందని వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ చేసింది చంద్రబాబును కాదు, ప్రజాస్వామ్యాన్ని, ఒక విజన్‌ను అని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్‌లో అవినీతి జరిగిందన్నది వైసీపీ అబద్దపు ప్రచారం మాత్రమే అని తెలిపారు. ఏపీతో పాటు తెలంగాణ, గుజరాత్ సహా మొత్తం 8 రాష్ట్ర ప్రభుత్వాలతో సిమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ పనితీరు బాగుందని గతంలో వైసీపీ ప్రభుత్వమే అభింనందన పత్రం అందజేయలేదా అని ప్రశ్నించారు. కేవలం కక్ష్యతో అక్రమ కేసులతో అరెస్టులు చేశారని, ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని హైకోర్టు చెప్పిందన్నారు. తమ నాయకుడిని అక్రమ అరెస్టు చేస్తే చూస్తూ ఊరుకుంటామా అని అన్నారు. వైసీపీ అవినీతి, అక్రమాల్ని కప్పి పుచ్చుకునేందుకే అక్రమ అరెస్టు అని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ 26 ఎంక్వైరీలు వేసి ఏం సాధించారని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు టీడీపీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే వీళ్ల సంగతి తేలుస్తామన్నారు. వైసీపీ నేతలకు సబ్జెక్ట్ తెలిస్తే మాట్లాడండి, లేకుంటే నోరు మూసుకోవాలన్నారు. తమ నాయకుడిని నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించమని పంచుమర్తి అనురాధ హెచ్చరించారు.

Updated Date - 2023-09-09T14:22:01+05:30 IST