Panchumarthi Anuradha: బిల్డప్ సీఎం జగన్ 27 సార్లు ఢిల్లీకెళ్లి సాధించిందేంటి??

ABN , First Publish Date - 2023-10-07T12:31:59+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బిల్డప్ సీఎం జగన్ 27 సార్లు డిల్లీకెళ్లి సాధించేందేంటి అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, త్రిబుల్ ఐటీ నిధులు, వెనుకబడిన జిల్లాల రూ.1400 కోట్ల ప్యాకేజీ ఏమైందని నిలదీశారు.

Panchumarthi Anuradha: బిల్డప్ సీఎం జగన్ 27 సార్లు ఢిల్లీకెళ్లి సాధించిందేంటి??

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై (CM YS Jaganmohan Reddy) టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (TDP MLC Panchumarthy Anuradha) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బిల్డప్ సీఎం జగన్ 27 సార్లు డిల్లీకెళ్లి సాధించేందేంటి అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, త్రిబుల్ ఐటీ నిధులు, వెనుకబడిన జిల్లాల రూ.1400 కోట్ల ప్యాకేజీ ఏమైందని నిలదీశారు. పెట్రో కాంప్లెక్స్, తిరుపతి ఐజర్‌కు నిధులు ఏమయ్యాయని అడిగారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సులో జగన్ పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు 9,371 ఎకరాల్లో గంజాయి ధ్వంసం చేశామన్నారని.. వాటి రుజువులు ఏవి? పోటోలున్నాయా? విజువల్స్ ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్రంలో నిజంగా గంజాయిని అరికడితే బెంగుళూరు, ఉత్తరప్రదేశ్, కేరళ, డిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో పట్టుబడ్డ గంజాయి ఏపీ నుంచే వచ్చాయని అక్కడి పోలీసు ధికారులు ఎందుకు చెబుతారని అడిగారు. బెంగుళూరులో కస్టమ్స్ అధికారులు ఓ పార్సిల్‌ను పరిశీలిస్తే 4.49 కిలోల ఎఫిడ్రిన్ అనే మత్తు పదార్దం దొరికిందని చెప్పారన్నారు. ఇది విజయవాడ భారతీ నగర్‌లోని కొరియర్ సంస్ధ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్నట్టు గుర్తించారన్నారు. గతంలో గుజరాత్ ముంద్రా పోర్టులో ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి ఇరాన్‌ ద్వారా బెజవాడలోని ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ పేరుతో రవాణా చేస్తున్న 72 వేల కోట్ల హెరాయిన్ పట్టుబడింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజల్ని నాశనం చేసి గంజాయి పండించి వైసీపీ ఎమ్మెల్యేలు కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. సీఎంకి సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. రాయలసీమ ఎండిపోయేలా తీర్మానం చేస్తే... కేంద్ర జలశక్తి మంత్రిని ఎందుకు కలవలేదని అడిగారు. కలవాల్సింది ఇరిగేషన్ మంత్రినా? నిర్మలా సీతారామన్‌నా? అని ఎమ్మెల్సీ అన్నారు.


వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడేందుకు, తన కేసుల మాఫీకోసమే సీఎం డిల్లీ పర్యటనలు అని వ్యాఖ్యలు చేశారు. అరకు కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత చంద్రబాబుదే అని చెప్పుకొచ్చారు. జీ20 సదస్సులో అరకు కాఫీని విదేశీ ప్రతినిధులకు గిప్ట్‌గా ఇచ్చినందుకు చంద్రన్నకు పాధాబివందనమన్నారు. అలాంటి ఉత్తరాంధ్రని గంజాయితో నాశనం చేస్తూ... కేంద్రానికి తప్పుడు నివేదికలిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయికి బానిసలై తాడేపల్లి సీఎం ఇంటి పక్కనే రైల్వే ట్రాక్‌పై ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. సీఎం జగన్ అబద్దాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఢిల్లీ వెళ్లిన సీఎం ట్రిబ్యునల్ గురించి ప్రధానిని కలవకుండా అక్కడే ఉండి లేఖ రాయడం ఏంటి? అని ప్రశ్నించారు. సీమను ఎడారి చేసేలా నిర్ణయాలు జరుగుతున్నా... జగన్ మాత్రం ఏమీ పట్టనట్టున్నారని.. జగన్ సీమకు చేస్తున్న అన్యాయం ప్రజలకు అర్థమైందని పంచుమర్తి అనురాధ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-10-07T15:51:57+05:30 IST