TDP: టీడీపీ మహాపాదయాత్ర, బహిరంగ సభలపై ఆంక్షలు.. వంట సామాగ్రిని తీసుకెళ్లిన పోలీసులు

ABN , First Publish Date - 2023-10-01T17:27:14+05:30 IST

తాడేపల్లిగూడెంలో టీడీపీ (TDP) మహాపాదయాత్ర, బహిరంగ సభలపై పోలీసులు (POLICE) ఆంక్షలు విధించారు.

TDP: టీడీపీ మహాపాదయాత్ర, బహిరంగ సభలపై ఆంక్షలు.. వంట సామాగ్రిని తీసుకెళ్లిన పోలీసులు

పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెంలో టీడీపీ (TDP) మహాపాదయాత్ర, బహిరంగ సభలపై పోలీసులు (POLICE) ఆంక్షలు విధించారు. టీడీపీ ఆందోళన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

పాదయాత్రకు, బహిరంగ సభకు హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వలవల బాబ్జీ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరించారు. పాలకొల్లులో ఎమ్మెల్యే రామానాయుడిని తాడేపల్లిగూడెం వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. నరసాపురంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా తాడేపల్లిగూడెంలో ఉమ్మడి జిల్లాకు చెందిన 10వేల మందితో టీడీపీ మహాపాదయాత్ర, బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఆఖరి నిమిషంలో పర్మిషన్ లేదంటూ టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. సభ జరిగే కళ్యాణ మంటపం వద్ద వంట సామాగ్రిని పోలీసులు తీసుకుపోయారు.

Updated Date - 2023-10-01T17:27:30+05:30 IST