Share News

Nara Lokesh: ఎన్‌ఆర్‌ఐ యష్ అరెస్ట్‌ను ఖండించిన లోకేష్

ABN , Publish Date - Dec 23 , 2023 | 10:39 AM

Andhrapradesh: ఎన్‌ఆర్‌ఐ యష్ అరెస్ట్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. యాష్ అరెస్టు అప్రజాస్వామికమని పేర్కొన్నారు. యాష్‌ను అరెస్టు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు ఏం సంకేతం ఇస్తున్నారని ప్రశ్నించారు. యాష్‌ను వెంటనే విడుదల చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Nara Lokesh: ఎన్‌ఆర్‌ఐ యష్ అరెస్ట్‌ను ఖండించిన లోకేష్

అమరావతి: ఎన్‌ఆర్‌ఐ యష్ (NRI Yash) అరెస్ట్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) ఖండించారు. యష్ అరెస్టు అప్రజాస్వామికమని పేర్కొన్నారు. యష్‌ను అరెస్టు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు ఏం సంకేతం ఇస్తున్నారని ప్రశ్నించారు. యష్‌ను వెంటనే విడుదల చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.


మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని పరామర్శించేందుకు అమెరికా నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ యష్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో యష్‌ను అరెస్ట్ చేసి... గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఆయన మీద కేసులు పెండింగ్‌లో ఉండటంతో తీసుకువచ్చామని సీఐడీ పోలీసులు చెబుతున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ, న్యాయవాదులు పీబీజీ ఉమేష్ చంద్ర, గూడుపాటి లక్ష్మీనారాయణ గుంటూరు సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. సీఐడీ అధికారులతో న్యాయవాదులు మాట్లాడారు. యష్‌కు సీఆర్పీసీలోని 41ఏ సెక్షన్ ప్రకారం సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. జనవరి 11న విచారణకు హాజరుకావాలని నోటీసులో సీఐడీ అధికారులు కోరారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 23 , 2023 | 11:40 AM