Chandrababu: ఏపీలో యూనివర్సిటీల ర్యాంకింగ్ పడిపోవడంపై చంద్రబాబు స్పందన..

ABN , First Publish Date - 2023-06-07T15:10:36+05:30 IST

ఏపీలో యూనివర్సిటీల ర్యాంకింగ్ పడిపోవడంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ నివేదిక‌ను ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

Chandrababu: ఏపీలో యూనివర్సిటీల ర్యాంకింగ్ పడిపోవడంపై చంద్రబాబు స్పందన..

అమరావతి: ఏపీలో యూనివర్సిటీల (AP Universities) ర్యాంకింగ్ పడిపోవడంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (National Institute Ranking Framework) నివేదిక‌ను ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ (YCP Government) విధానాల వల్ల యువత భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో కీలకమైన ఉన్నత విద్యా విద్యారంగం నాశనం అయ్యిందని వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లుగా ఏపీ వర్సిటీల ర్యాంకింగ్ పడిపోతున్న సంగతి ఎన్‌ఐఆర్‌ఎఫ్ (NIRF) నివేదికను పరిశీలిస్తే అర్థం అవుతుందన్నారు. 2019లో 29వ ర్యాంక్‌లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ (Andhra university) నేడు 76వ స్థానానికి పడిపోయిందని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (Sri Venkateswara University) కనీసం టాప్ 100లో స్థానం పొందలేకపోవడం విచారకరమని అన్నారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకపోవడం, వర్సిటీలను వైఎస్సార్‌సీపీ రాజకీయ, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చడం వల్లనే ఈ దుస్థితి వచ్చిందని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Updated Date - 2023-06-07T15:10:36+05:30 IST