Chandrababu: ‘23 ఓట్లు, 23వ తేదీ, 23వ సంవత్సరం గెలిచాం.. ఇది కాదా దేవుడి స్క్రిప్ట్ అంటే’

ABN , First Publish Date - 2023-04-12T16:10:22+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు.

Chandrababu: ‘23 ఓట్లు, 23వ తేదీ, 23వ సంవత్సరం గెలిచాం.. ఇది కాదా దేవుడి స్క్రిప్ట్ అంటే’

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) సమక్షంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు (YCP Leaders) టీడీపీ (TDP)లో చేరారు. రాణిగారితోటలో వైసీపీ స్టేట్ బీసీ సెల్ సెక్రటరీ, ఇతర ముఖ్య నేతలకు చంద్రబాబు పార్టీ కండువా కప్పారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ... ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె నిరంతరం ప్రజలలో ఉంటారని.. ఎవ్వరు పిలిచినా పలుకుతారన్నారు. ఇక్కడ ఉన్న పిల్లలు ఎంత దూరం అయినా పసుపు జండాతో పరుగు పెడుతున్నారని... పిల్లలు జెండా పట్టారంటే టీడీపీకి తిరుగులేదు అంతే అని అన్నారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అని అందరూ కోరుకుంటున్నారన్నారు. సైకో అయిన పోవాలి లేకపోతే మనం అయినా రాష్ట్రం వదిలి పోవాలి.... ఏదో ఒకటి జరగాలని అన్నారు. మీ ఇంటి తలుపుకు అనైతికంగా వైసీపీ వాళ్ళు స్టికర్‌లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. జగన్ మీ బిడ్డ కాదు... జగన్ క్యాన్సర్ గడ్డ అని టీడీపీ అధినేత వ్యాఖ్యలు చేశారు.

ఈ ప్రభుత్వ హయాంలో ఆదాయం తగ్గి... ఖర్చులు పెరిగాయని విమర్శించారు. జగన్ మా భవిష్యత్తు కాదు, జగనే మా నమ్మకం కాదని... జగన్ రాష్ట్రానికి పట్టిన దరిద్రమని విరుచుకుపడ్డారు. బయట రాష్ట్రాల నాయకులు మనల్ని చూసి జాలి పడుతున్నారని తెలిపారు. ‘‘నిన్ను నాశనం చేసే పార్టీని నువ్వు మొస్తావా... సమాజాన్ని నాశనం చేసే పార్టీని మోస్తావా. ఈ నియోజకవర్గంలో కొత్తగా చిన్న సైకో తయారయ్యాడు. ఇలాంటి రౌడీయిజాన్ని అణచివేస్తాం’’ అని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో ఈ పోలీసులే బాగా పనిచేశారని తెలిపారు. సైకోపోతే వాళ్లే బాగా పనిచేస్తారన్నారు. ‘‘ఎమ్మెల్యేలు పనిచేయక పోతే నిలదీసే హక్కు ఉంది... మహా అయితే నా మీద కేసులు పెడతాడు. పెట్టుకుంటూనే ఉండు.. పీక్కుంటూనే ఉండు.. ఏం చేస్తావో చూస్తాం’’ అని వ్యాఖ్యలు చేశారు. రాజధాని పోయింది, ఉద్యోగాలు పోయాయి కానీ ప్రజల్లో మాత్రం చైతన్యం రాలేదన్నారు. అయితే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 3 స్థానాలు గెలిచామని... తాను అనుకున్న చైతన్యం ఇప్పుడు వచ్చిందని అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మన:సాక్షితో ఓటు వేయాలని కోరామని తెలిపారు. 23 ఓట్లు.. 23వ తేదీన.. 23 సంవత్సరం గెలిపించారని.. ఇది కాదా దేవుడి స్ర్కిప్ట్ అంటే.. అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2023-04-12T16:43:02+05:30 IST