Share News

Chandrababu: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

ABN , First Publish Date - 2023-12-08T13:15:24+05:30 IST

Andhrapradesh: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉందని.. అహంకారం ఉంటే ఏమౌతుందనేది తెలంగాణలో చూశామన్నారు.

Chandrababu: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

అమరావతి: తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections) రెండు దఫాలు అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోగా.. కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉందని.. అహంకారం ఉంటే ఏమౌతుందనేది తెలంగాణలో చూశామన్నారు. మరో మూడు నెలల తర్వాత ఏపీలో తెలంగాణ పరిస్థితే అంటూ చంద్రబాబు కామెంట్స్ చేశారు.


ఎంతో మానసికక్షోభ అనుభవించా...

శుక్రవారం తెనాలి నియోజకవర్గం నందివెలుగులో దెబ్బతిన్న పంట పొలాలను చంద్రబాబు పరిశీలించారు. పొలాల్లోకి దిగి నీట మునిగిన చేనును స్వయంగా పరిశీలించారు. తుపాను వల్ల పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... మానవ తప్పిదం వల్లే రైతులు తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వ తప్పిదాలు ప్రశ్నిస్తే, తనలాంటి వాళ్లని కూడా జైల్లో పెడతారన్నారు. చేయని తప్పుకు ఎంతో మానసిక క్షోభ అనుభవించానన్నారు. ముందస్తు చర్యలతో నష్ట నివారణ చర్యలకు అన్ని అవకాశాలు ఉన్నా, ప్రభుత్వం సకాలంలో స్పoదించలేదపి మండిపడ్డారు. కౌలు రైతుల్ని చూస్తే గుండె తరుక్కుపోతోందని ఆవేదన చెందారు. ప్రభుత్వం రైతుల్ని ఆదుకోకుంటే, నష్టపోయిన ప్రతీ రైతుని 3 నెలల తర్వాత తానే ఆదుకుంటానని హామీ ఇచ్చారు. కౌలు రైతుల్ని కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానన్నారు.

కరువు వల్ల సగం మంది పంట వేయలేదన్నారు. పంట వేసిన వారంతా తుపాను వల్ల నష్టపోయారని తెలిపారు. దేశంలోనే రైతులు ఎక్కువ అప్పుల పాలైంది ఏపీలోనే అని చెప్పుకొచ్చారు. పట్టిసీమ నీరు ముందుగా వదిలి ఉంటే ఈపాటికి రైతులు పంటల్ని కాపాడుకుని ఉండేవారన్నారు. తన షెడ్యూల్ ఖరారవుతే కానీ ముఖ్యమంత్రిలో కదలిక లేదన్నారు. వరి రైతులకు ఎకరాకు రూ.50 వేలు పైనే నష్టం వాటిల్లిందన్నారు. 2011 లోనే నష్టపరిహారం కింద రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.10,000 ఇచ్చామని గుర్తుచేశారు. ఇప్పుడు ఎకరాకు రూ.30,000 ఇస్తే గానీ రైతులకు గిట్టుబాటు కాదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోతే మరో మూడు నెలలు గడిస్తే టీడీపీ అధికారంలోకి రాగానే తామే రైతులకు ఇస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Updated Date - 2023-12-08T13:15:26+05:30 IST