TarakaRatna: తారకరత్నకు సెకండ్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం.. ఫైనల్‌గా కుటుంబ సభ్యుల నిర్ణయం ఇదీ..

ABN , First Publish Date - 2023-01-27T21:20:49+05:30 IST

నందమూరి తారకరత్నను (TarakaRatna) బెంగళూరుకు (Bangalore) తరలింపుపై ఇవాళ మధ్యాహ్నం నుంచీ ఉత్కంఠ కొనసాగుతోంది.

TarakaRatna: తారకరత్నకు సెకండ్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం.. ఫైనల్‌గా కుటుంబ సభ్యుల నిర్ణయం ఇదీ..

నందమూరి తారకరత్నను (TarakaRatna) బెంగళూరుకు (Bangalore) తరలింపుపై ఇవాళ మధ్యాహ్నం నుంచీ ఉత్కంఠ కొనసాగుతోంది. బెంగళూరుకు తరలించే విషయంపై కుటుంబ సభ్యులు నిశితంగా ఆలోచించి కుప్పంలోని (Kuppam) పీఈఎస్ నుంచే వైద్యం చేయించాలని కుటుంబ సభ్యులు (Family Members) నిర్ణయించారు. దీంతో నారయణ హృదాయాలయ వైద్య బృందం పీఈఎస్ (EPS Hospital) ఆస్పత్రికి చేరుకుంది. బెంగళూరుకు తరలించేలోపు సెకండ్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని అందుకే కుప్పంలోనే వైద్యం చేయించాలని కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు.. ఆర్టిఫిషియల్ హార్ట్ (Artificial Heart) అమరిక గురించి డాక్టర్ల మధ్య చర్చ నడుస్తోంది. అయితే ఉదయం కంటే తారకరత్న ఆరోగ్యం మెరుగైందని పీఈఎస్ వైద్యులు చెబుతున్నారు.

అందుకే ఇలా..!

ఇదిలా ఉంటే.. కాసేపట్లో తారకరత్న సతీమణి (Tarakaratna Wife) కుప్పం చేరుకోనున్నారు. ఆమె కుప్పం వచ్చాక బెంగళూరుకు తరలించాలా.. వద్దా..? అనేదానిపై తుది నిర్ణయం తీసుకోవాలని కుటుంబ సభ్యులు భావించారు. ఇందుకోసం 2 అంబులెన్స్‌లను కూడా డాక్టర్స్ సిద్ధం చేశారు కూడా. అయితే.. సెకండ్ స్ట్రోక్ (Second Stroke) వచ్చే ప్రమాదం ఉందని ఇక బెంగళూరుకు తరలింపు కష్టమని కుప్పంలోనే చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం నారాయణ హృదయాలయ వైద్యులు (Doctors) తారకరత్న చికిత్స అందిస్తున్నారు.

95 శాతం బ్లాక్స్..!

టీడీపీ యువ నేత లోకేష్ (Nara Lokesh) ‘యువగళం’ పాదయాత్రలో (YuvaGalam Padayatra) నడుస్తూ తారకరత్న (TarakaRatna Hospitalized) సొమ్మసిల్లిపడిపోవడం, ఆసుపత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుగా (Tarakaratna Heart Attack) నిర్ధారించడంతో టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు ఆందోళనకు లోనయ్యారు. అయితే.. నిన్నమొన్నటి దాకా.. అంతెందుకు పాదయాత్ర ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించిన తారకరత్నకు గుండెపోటు రావడం ఏంటని అభిమానులు విస్మయం వ్యక్తం చేశారు. తారకరత్న హార్ట్‌లో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆయనకు గుండెపోటు వచ్చిందని చికిత్సనందించిన వైద్యులు తెలిపారు. హార్ట్‌లో కుడి, ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

Updated Date - 2023-01-27T21:37:45+05:30 IST