Share News

Skill Case: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై నేడు సుప్రీంలో విచారణ

ABN , First Publish Date - 2023-11-28T10:10:22+05:30 IST

స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలంటూ... సుప్రీంకోర్టును ఏపీ సీఐడీ ఆశ్రయించింది. ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ... రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాలు చేస్తూ గత వారం ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది.

Skill Case: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై నేడు సుప్రీంలో విచారణ

ఢిల్లీ : స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలంటూ... సుప్రీంకోర్టును ఏపీ సీఐడీ ఆశ్రయించింది. ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ... రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాలు చేస్తూ గత వారం ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు రానుంది.

రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరులో... తమ వాదనలు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. తాము చెప్పిన ఏ విషయాన్ని హైకోర్టు పట్టించుకోలేదన్నదే మా ఏడుపంతా అని పిటిషన్‌ దాఖలు చేసిన తర్వాత ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైకోర్టు తన పరిధి దాటి తీర్పులో వ్యాఖ్యలు చేసిందని ప్రభుత్వం పేర్కొంటోంది. వెంటనే చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది.

Updated Date - 2023-11-28T10:10:24+05:30 IST