25, 26 తేదీల్లో ఇఫ్టూ రాష్ట్ర మహాసభలు
ABN, First Publish Date - 2023-02-11T23:45:11+05:30 IST
ఈ నెల 25, 26 తేదీల్లో శ్రీకాకుళంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) రాష్ట్ర మహాసభ లు నిర్వహించనున్నట్లు ఆహ్వాన సంఘం అధ్యక్షుడు సన్న శెట్టి రాజశేఖర్ తెలిపారు. శనివారం స్థానికఎన్జీవో హోమ్‌లో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు.
అరసవల్లి: ఈ నెల 25, 26 తేదీల్లో శ్రీకాకుళంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) రాష్ట్ర మహాసభ లు నిర్వహించనున్నట్లు ఆహ్వాన సంఘం అధ్యక్షుడు సన్న శెట్టి రాజశేఖర్ తెలిపారు. శనివారం స్థానికఎన్జీవో హోమ్‌లో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభు త్వం రద్దుచేసి 4 లేబర్ కోడ్స్‌గా తీసుకువచ్చిందన్నారు. కార్పొరేట్లకు ఊడిగం చేసే పనిలో కేంద్రం ఉందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కారుచౌకగా కార్పొరేట్లకు అమ్మేందుకు పూనుకుంటుందని విమర్శించారు. ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన సాధ్య పడుతుందన్నారు. అన్ని వర్గాల కార్మికులు ఈ మహాసభ లకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్ర మంలో ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గణేష్, నాయకులు తాండ్ర ప్రకాష్, అన్నెపు సూర్యనారాయణ, సాధు శ్రీనివాస్, కురమాన తిరుమల, నూకన్న, కె.రాజేశ్వరి, సంధ్య, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
Updated at - 2023-02-11T23:45:11+05:30