Raghurama: శ్రీధర్‌రెడ్డి అదృష్టవంతుడు: రఘురామ

ABN , First Publish Date - 2023-02-06T18:13:50+05:30 IST

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy)కి సెక్యూరిటీ తొలగించడం సరికాదని ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghuramakrishna Raju) తప్పుబట్టారు.

Raghurama: శ్రీధర్‌రెడ్డి అదృష్టవంతుడు: రఘురామ

ఢిల్లీ: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy)కి సెక్యూరిటీ తొలగించడం సరికాదని ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghuramakrishna Raju) తప్పుబట్టారు. కొందరి వల్లే శ్రీధర్‌రెడ్డి ఆత్మాభిమానం దెబ్బతిన్నదని తెలిపారు. కోటంరెడ్డి ప్రజా మద్దతు ఉందని తెలిపారు. సీఎం జగన్‌ను వదులుకున్న శ్రీధర్‌రెడ్డి అదృష్టవంతుడని ప్రశంసించారు. కోటంరెడ్డి బాటలోనే ఆనం రాంనారాయణరెడ్డి (Anam Rannarayana Reddy) ఉన్నారని తెలిపారు. ఇసుక రేటు తగ్గించాలని తాను ప్రభుత్వానికి చెప్పానని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

జగన్‌‌ (Jagan)ను భుజానికి ఎత్తుకుని, పార్టీ గెలుపు కోసం కోటంరెడ్డి కృషి చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా తలకిందులవుతోంది. వైసీపీ (YCP)పై కోటంరెడ్డి తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేయడమే కాదు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ (TDP) నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించి కలకలం రేపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ (Phone tapping)లో విషయంలో కలత చెంది వైసీపీని వీడుతున్నానని శ్రీధర్‌రెడ్డి ప్రకటించిన వెంటనే ఈయనకు నెల్లూరు మేయర్, కార్పొరేటర్లు మద్దతు ప్రకటించారు. వీరితో పాటు వివిధ సామాజిక వర్గాల వారూ కోటంరెడ్డికి పెద్ద ఎత్తున సంఘీభావం వ్యక్తం చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. వారం క్రితం వరకు నెల్లూరు జిల్లాలో వైసీపీ గెలిచే మొదటి స్థానం అనుకున్న రూరల్‌ నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ పరిస్థితి పూర్తిగా తలకిందులయ్యింది. సార్వత్రిక సమరానికి ఏడాదిన్నర కాలం ఉండగానే పార్టీలో అంతర్గత కలహాలు. విభేదాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు జిల్లా (Nellore District) వైసీపీ నేతల తిరుగుబాటు కలకలం రేపుతోంది.

శ్రీధర్‌రెడ్డికి సెక్యూరిటీ కుదింపు

వైసీపీ అధిష్ఠానంపై ధిక్కార స్వరం వినిపిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి సెక్యూరిటీ కుదించారు. ఇప్పటి వరకు టూ ప్లస్‌ టూ గన్‌మెన్‌ ఉండగా, ఆ సంఖ్యను వన్‌ ప్లస్‌ వన్‌కు తగ్గించారు. ఇటీవలే మరో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సెక్యూరిటీని కూడా కుదించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలోనే భద్రత కుదించినట్లు సమాచారం.

Updated Date - 2023-02-06T18:13:53+05:30 IST