SriRama Navami Celebrations: విశాఖ శ్రీశారదాపీఠంలో శ్రీరామనవమి వేడుకలు

ABN , First Publish Date - 2023-03-30T16:59:08+05:30 IST

విశాఖ శ్రీశారదాపీఠం (Visakha Srisarada Peetham)లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి.

SriRama Navami Celebrations: విశాఖ శ్రీశారదాపీఠంలో శ్రీరామనవమి వేడుకలు

విశాఖపట్నం: విశాఖ శ్రీశారదాపీఠం (Visakha Srisarada Peetham)లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. వేడుకల్లో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు పాల్గొన్నారు. కల్యాణం అనంతరం భక్తులకు పానకం, ప్రసాదం పంపిణీ చేశారు.

ఇటీవల అతి సనాతనమైన భారత వైదిక చరిత్రలోనే కనీవినీ ఎరుగని మహాయజ్ఞం కురుక్షేత్రలో నిర్వహిస్తుండటం గర్వకారణమని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Union Minister Anurag Thakur) అన్నారు. శంకరాచార్య సంప్రదాయ పీఠాల్లో గుర్తింపు పొందిన విశాఖ శ్రీ శారదాపీఠం (Visakha Sarada Peetham) దీన్ని పర్యవేక్షించడం, అందులో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు. కురుక్షేత్ర వేదికగా గుంతి ఆశ్రమం నిర్వహణలో చేపట్టిన శ్రీ లక్ష చండీ మహాయజ్ఞంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. యజ్ఞంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ స్వరూపానందేంద్ర స్వామి (Swarupanandendra Swamy) పర్యవేక్షణలో యజ్ఞం పరిపూర్ణమవుతుందని అన్నారు. అమ్మవారి ఆదేశం ఉంటే తప్ప ఇంత బృహత్తర కార్యక్రమం చేపట్టడం సాధ్యం కాదని తెలిపారు. యజ్ఞభూమిని సందర్శించినపుడు విశేష అనుభూతి పొందానని, ఖచ్చితంగా జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయని ఆశిస్తున్నా అని అన్నారు.

Updated Date - 2023-03-30T17:04:50+05:30 IST