YCP MLA: వైసీపీ ఎమ్మెల్యే అనిల్కుమార్కు వ్యతిరేకంగా నినాదాలు.. ఉద్రిక్తత

ABN , First Publish Date - 2023-03-30T16:27:50+05:30 IST

నెల్లూరు సిటీ వైసీపీ (YCP) ఎమ్మెల్యే అనిల్కుమార్ (MLA Anil Kumar) కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది.

YCP MLA: వైసీపీ ఎమ్మెల్యే అనిల్కుమార్కు వ్యతిరేకంగా నినాదాలు.. ఉద్రిక్తత

నెల్లూరు: కొత్తూరు మండలం అంబాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నెల్లూరు సిటీ వైసీపీ (YCP) ఎమ్మెల్యే అనిల్కుమార్ (MLA Anil Kumar) కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. డీఎస్పీతో సహా భారీగా పోలీసు బలగాలు మొహరించారు. సర్వే నం.1/1లో అక్రమంగా వేసిన గుడిసెలను తొలగించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దళితులు వేసుకున్న 300 గుడిసెలను అధికారులు తొలగించారు. గుడిసెలు వేసిన ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటికి వెళ్లడం వల్ల నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఊడిందేమీ లేదు. 2024 ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఓటమి తప్పదు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు గెలిచినా తాను మళ్లీ నెల్లూరులో అడుగుపెట్టను. ఒకవేళ అదే జరిగితే తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటానన్నారు. ఈ విషయంపై తన దగ్గరికి ఎవరైనా రండి కావాలంటే బాండ్ పేపరు మీద రాసి సంతకాలు పెట్టుకుందామని, తాను గెలిచి అసెంబ్లీకి వస్తే.. మీరు రాజకీయాల నుంచి వెళ్లిపోతారా. 2024 ఎన్నికల్లో ఎవరు అసెంబ్లీకి వస్తారో తేల్చు తేల్చుకుందాం’ అని అనిల్ సవాల్ విసిరారు.

Updated Date - 2023-03-30T16:34:56+05:30 IST