R. Narayanamurthy : మీది రామరాజ్యం ఎలా అవుతుంది

ABN , First Publish Date - 2023-02-12T22:38:49+05:30 IST

రైతుల కన్నీళ్లు, పాలకుల నిర్లక్ష్యంపై వడ్డే రాసిన పుస్తకం ఆలోచింప‌ చేసే విధంగా ఉందని సినీ నిర్మాత, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి( R. Narayanamurthy) అన్నారు.

 R. Narayanamurthy : మీది రామరాజ్యం ఎలా అవుతుంది

విజయవాడ(Vijayawada): రైతుల కన్నీళ్లు, పాలకుల నిర్లక్ష్యంపై వడ్డే రాసిన పుస్తకం ఆలోచింప‌ చేసే విధంగా ఉందని సినీ నిర్మాత, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి( R. Narayanamurthy) అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ ప్రైవేటు పరమేనా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI) కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ సంస్థలను దోచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగానికి అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.నేడు పాన్ ఇండియా సినిమాలు(Pan India Movies) తీస్తున్నాం..ఇది కూడా పాన్ ఇండియా రైతు గర్జన(RAITHU GARJANA) సదస్సుగా పేరు గడుస్తుందని చెప్పారు. ‘‘అయ్యా మోదీ గారూ మాది రామరాజ్యం, ప్రజారాజ్యం అన్నారు.. ఆడిన మాట తప్పలేదు కాబట్టే రాముడ్ని ఇంకా పూజిస్తున్నాం.మేము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిధులన్నారు.నల్లధనం బయటకి తీసి... ప్రజలకు పంచుతామన్నారు. వీటిలో ఏ ఒక్క హామీ మీరు ఎందుకు అమలు‌ చేయలేదు. ఈ హామీలను అమలు చేయకుడా మీది రామరాజ్యం ఎలా అవుతుందో చెప్పాలి’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

‘‘మూడు నల్ల చట్టాలను రద్దు చేస్తూ మోదీ అనేక హామీలు ఇచ్చారు. ఇంతవరకు వాటి ఊసే లేదు... అడిగితే కేసులు పెడుతున్నారు. మోదీజీ.. ఆడిన మాట తప్పే వారికి రాముని పేరు ఎత్తే అర్హత లేదు.ఇప్పుడయినా ఇచ్చిన హామీలు అమలు‌ చేసి.. మాట నిలబెట్టుకోవాలి. మార్చి 20వ తేదీన పార్లమెంటు ఎదుట రైతులు ఉద్యమం చేస్తున్నారు.రాహుల్‌గాంధీ(RAHUL GANDHI), కాంగ్రెస్ నేతలు కూడా రైతులకు అండగా నిలవాలి.స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను గత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు‌ చేయలేదు.ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా మాట తప్పి రైతులకు అన్యాయం చేసింది. బీజేపీ, కాంగ్రెస్‌లు (BJP, CONGRESS) కార్పొరేట్ల అభివృద్ధి కోసం మాత్రమే పని చేస్తున్నాయి. కాంగ్రెస్ అంబానీకి(AMBANI), బీజేపీ అదానీ(ADANI)కి ప్రజల ఆస్తులను దోచి పెట్టాయి.విద్య, వైద్యం పబ్లిక్ సెక్టార్లోనే ఉండాలి.అన్ని రాజకీయ పార్టీలు తమ అజెండాను పక్కన పెట్టి రైతు అజెండాతో ముందుకు రావాలి.ఈ రైతు గర్జన ఉధృతం‌ కాక ముందే మోదీ స్పందించాలి. రాష్ట్రాలపై మోదీ సవతి తల్లి ప్రేమ చూపుతున్నారు’’ అని ఆర్. నారాయణమూర్తి ధ్వజమెత్తారు.

Updated Date - 2023-02-12T22:49:17+05:30 IST