Jogi Ramesh: మంత్రి జోగి రమేష్‌కు నిరసన సెగ

ABN , First Publish Date - 2023-04-20T20:19:21+05:30 IST

గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ (Jogi Ramesh)కు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో చుక్కెదురైంది. గురువారం ఆకివీడు మండలం కోళ్లపర్రులో ...

Jogi Ramesh: మంత్రి జోగి రమేష్‌కు నిరసన సెగ

ఆకివీడు: గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ (Jogi Ramesh)కు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో చుక్కెదురైంది. గురువారం ఆకివీడు మండలం కోళ్లపర్రులో సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేదలకు ఎన్నో చేసిందని చెప్పగా ఒక మహిళ నిరుపేదలమైన మాకు ఏమి ఇచ్చారంటూ నిలదీయడంతో ఖంగుతిన్నారు. ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నానని ఇప్పటివరకు లేదని వాపోయింది. పెదకాపవరంలో ఏళ్ల తరబడి రోడ్డుపక్కన నివాసం ఉంటున్నామని తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ మంత్రి కారును చుట్టుముట్టారు. తాళ్లకోడులో తాగునీరు, రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-04-20T20:19:21+05:30 IST