Share News

President: నారా లోకే‌ష్‌కు రాష్ట్రపతి లేఖ

ABN , First Publish Date - 2023-10-14T21:46:10+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేశ్‌కు (Nara Lokesh) రాష్ట్రపతి (President) ద్రౌపదిముర్ము లేఖ రాశారు.

President: నారా లోకే‌ష్‌కు రాష్ట్రపతి లేఖ

ఢిల్లీ: టీడీపీ యువనేత నారా లోకేశ్‌కు (Nara Lokesh) రాష్ట్రపతి (President) ద్రౌపదిముర్ము లేఖ రాశారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుపై జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతికి టీడీపీ ఎంపీలు రాసిన లేఖపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. గతనెల 26న లోకేశ్‌ నేతృత్వంలో టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలిసిన లేఖ ఇచ్చారు. ఎంపీలు అందించిన లేఖను కేంద్ర హోంశాఖకు రాష్ట్రపతి కార్యాలయం పంపించింది. ఎంపీలు రాసిన లేఖను కూడా దానికి రాష్ట్రపతి కార్యాలయం జతచేసింది. టీడీపీ ఎంపీల లేఖపై దృష్టి సారించాలని రాష్ట్రపతి కార్యాలయం కోరింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు రాష్ట్రపతి కార్యాలయం డిప్యూటీ కార్యదర్శి రుబీనా చౌహాన్ సమాచారాన్ని పంపించారు.

Updated Date - 2023-10-14T21:48:04+05:30 IST