Prattipati: చిలకలూరిపేటలో మాజీమంత్రి ప్రత్తిపాటి గృహనిర్బంధం
ABN , First Publish Date - 2023-09-09T09:28:03+05:30 IST
మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు(Former Minister Prathipati Pullarao)ను పోలీసులు గృహనిర్బంధం చేశారు.
పల్నాడు జిల్లా: మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు(Former Minister Prathipati Pullarao)ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Former Chief Minister Nara Chandrababu Naidu)ని పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేయడంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎమర్జెన్సీని మించిన పరిస్థితులున్నాయన్నారు. హిట్లర్, గడాఫీలను మించిన అరాచకం నడుస్తోందన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటిరోజని ఆయన అన్నారు. చంద్రబాబు అరెస్టుతో జగన్ అన్ని హద్దులు దాటేశారని, ప్రశ్నించే వారిని అక్రమంగా అరెస్టు చేసి జైళ్లలో వేస్తున్నారని ఆయన అన్నారు. జగన్ నిరంకుశ చర్యకు ప్రజాకోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన అన్నారు.