Share News

Prashant Kishor: సీఎం జగన్‌పై వ్యతిరేకత.. యువతను ఆకర్షించేలా టీడీపీ కార్యాచరణ ఉండాలి

ABN , Publish Date - Dec 23 , 2023 | 08:42 PM

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మూడు గంటలపాటు చర్చించారు. ఈ సమావేశంలో కీలక అంశాల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

Prashant Kishor: సీఎం జగన్‌పై వ్యతిరేకత.. యువతను ఆకర్షించేలా టీడీపీ కార్యాచరణ ఉండాలి

అమరావతి: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మూడు గంటలపాటు చర్చించారు. ఈ సమావేశంలో కీలక అంశాల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో ప్రశాంత్ కిషోర్ నివేదిక ఇచ్చారు. ఆయా వర్గాలు, అంశాల వారీగా ప్రభుత్వ బలాబలాలను పీకే వివరించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పీకే తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే పలు అంశాలను చంద్రబాబుకు పీకే వివరించారు.

నిరుద్యోగం, ధరలు, విద్యుత్ ఛార్జీలు, పన్నుల బాదుడు ప్రభావం చూపుతాయని వెల్లడించారు. దళితులు, బీసీలపై దాడులు ఆయా వర్గాలను వైసీపీకి దూరం చేశాయన్నారు. ఒకరిద్దరు మినహా మంత్రులకు సున్న మార్కులని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి అహంకారం పెరిగిందనే భావన ప్రజల్లో వచ్చిందని పీకే పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాల మేరకు ప్రతిపక్షాల వ్యూహరచన ఉండాలని, అసంతృప్తితో ఉన్న యువతను ఆకర్షించేలా టీడీపీ కార్యాచరణ ఉండాలని పీకే సూచించారు. చంద్రబాబు అరెస్టుతో తటస్థులు, వైసీపీ వర్గాల్లో జగన్‌పై వ్యతిరేకత వచ్చిందని పీకే స్పష్టం చేశారు.


చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో రెండు సార్లు చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ ముందు, అరెస్ట్ తరువాత కూడా హైదరాబాద్‌లో చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. టీడీపీ తరపున ఎన్నికల వూహ్యకర్తగా పని చేసేందుకు ప్రశాంత్ కిషోర్ ఆసక్తి చూపారు. ఢిల్లీలో లోకేష్‌తో కూడా గతంలో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. ఈ రోజు చంద్రబాబు, లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరో సారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో టీడీపీ - జన సేన ప్రభుత్వం ఏర్పడుతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పీకే టీమ్ చంద్రబాబుతో భేటీ కావడంతో సర్వత్రా చర్చ నడుస్తోంది.

"చంద్రబాబు సీనియర్ నేత కావడంతోనే కలిశా. ఎప్పటి నుంచో చంద్రబాబును కలవాలని అనుకుంటున్నా. మళ్ళీ కూడా చంద్రబాబును కలుస్తా." అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 08:49 PM