Prakasam Dist.: వైసీపీలో మరో సారి బయటపడిన వర్గ విభేదాలు
ABN , First Publish Date - 2023-01-15T11:41:54+05:30 IST
ప్రకాశం జిల్లా: వైసీపీలో మరో సారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఒంగోలులో ఏర్పాటు చేసిన టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ఫ్లెక్సీలను కార్పోరేషన్ సిబ్బంది తొలగించారు.
ప్రకాశం జిల్లా: వైసీపీలో మరో సారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఒంగోలులో ఏర్పాటు చేసిన టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ఫ్లెక్సీలను కార్పోరేషన్ సిబ్బంది తొలగించారు. ఒకే ఫ్లెక్సీలో వైవి.సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటోలు ఉండటంతో ఫ్లెక్సీలను తొలగించారు. 2014 ఎన్నికల సమయం నుంచి బావబావమర్దులు వైవి.సుబ్బారెడ్డి, బాలినేని.. ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి శుభాకాంక్షలతో సుబ్బారెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కార్పోరేషన్ సిబ్బంది తొలగించారు. దీంతో వైవి.సుబ్బారెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.