Anna Rambabu: ఎమ్మెల్యే టికెట్ వ్యవహారంపై గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే ఫైర్.. అన్ని విషయాలు మాట్లాడుతానంటూ..

ABN , First Publish Date - 2023-06-29T22:44:34+05:30 IST

వైసీపీలో (YCP) టికెట్ల వ్యవహారంపై కొంత మంది నేతలపై గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు (Anna Rambabu) ఫైర్ అయ్యారు.

Anna Rambabu: ఎమ్మెల్యే టికెట్ వ్యవహారంపై గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే ఫైర్.. అన్ని విషయాలు మాట్లాడుతానంటూ..

ప్రకాశం: వైసీపీలో (YCP) టికెట్ల వ్యవహారంపై కొంత మంది నేతలపై గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు (Anna Rambabu) ఫైర్ అయ్యారు.

''ఎన్నికలకు సంవత్సరం సమయం ఉన్నా.. నాకు ఎమ్మెల్యే టికెట్ అంటే.. నాకు ఎమ్మెల్యే టికెట్ అంటూ నాయకులు పుట్టుకు వస్తున్నారు. టిక్కెట్ అడిగే వాళ్ళు ఎప్పుడైనా పార్టీ జెండాలు మోశారా. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మే వ్యాపారం కుదరదు. నన్ను అసమర్థుడి కింద లెక్కేయడం మంచిది కాదు. దీనివల్ల పార్టీకి నష్టమే తప్ప ఒరిగేది ఏమీ లేదు. ప్రజలు, నాయకుడి ఆశీస్సులు ఉంటే టికెట్, గెలుపు రెండూ వస్తాయి. పార్టీ బాగుంది కాబట్టే నాయకులందరూ బాగున్నారు. ఎన్నికల సమయంలో టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ కోసం పని చేస్తా. నేను ఎవరికి ద్రోహం చెయ్యలేదు, తప్పు చెయ్యలేదు. అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి గిద్దలూరులో లాగానే ఉందా.. నేను ఏమైనా లోకువగా కనిపిస్తున్నానా. అవసరమైనప్పుడు అన్ని విషయాలు మాట్లాడుతా.'' అని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-06-29T22:47:00+05:30 IST