Ponnala: సీఎం కేసీఆర్ తీరుపై పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-09-21T18:43:22+05:30 IST

గాంధీ భవన్‌లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ponnala: సీఎం కేసీఆర్ తీరుపై పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: గాంధీ భవన్‌లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


"చర్చకు రాకుండా, ఫాం హౌస్‌లో పడుకొని మీ నేతలతో మాట్లాడిస్తున్నావా కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రజల ముందుకు ఎందుకు రావు. ఏ మాటమీద నిలబడ్డావు నీవు. విద్యుత్ విషయంలో ప్రజలపై రూ.50వేల కోట్ల భారం. సాగునీటి ప్రాజెక్టులలోనూ అన్యాయం చేశారు. మేము ఎప్పుడూ హామీ ఇచ్చినా నెరవేర్చాం. ఇప్పుడు కూడా ఇచ్చిన గ్యారంటీ స్కీంలను అమలు చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంది." అని పొన్నాల ఫైర్ అయ్యారు.

Updated Date - 2023-09-21T18:43:22+05:30 IST