Seediri Appalaraju: జగన్‌ మాస్క్‌తో మంత్రి ఫొటో

ABN , First Publish Date - 2023-04-20T19:14:33+05:30 IST

స్వామి భజనకూ హద్దుండాలంటారు. మంత్రి సీదిరి అప్పలరాజు (Minister Seediri Appalaraju)కు మాత్రం ఈ హద్దే ఉండదు మరి. ప్రతిపక్షాలపై విరుచుపడడం..

Seediri Appalaraju: జగన్‌ మాస్క్‌తో మంత్రి ఫొటో

శ్రీకాకుళం: స్వామి భజనకూ హద్దుండాలంటారు. మంత్రి సీదిరి అప్పలరాజు (Minister Seediri Appalaraju)కు మాత్రం ఈ హద్దే ఉండదు మరి. ప్రతిపక్షాలపై విరుచుపడడం.. సీఎం జగన్‌ (CM Jagan)పై స్వామిభక్తి చాటుకోవడం ఆయనకు పరిపాటైంది. ఇటీవల మంత్రి పదవి పోతుందని ప్రచారం జరిగినప్పటి నుంచి ఇది మరీ ఎక్కువైనట్లు ఉంది. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) పలాస-కాశీబుగ్గ సమీపంలోని కిడ్నీ రిసోర్స్‌ సెంటర్‌ (Kidney Resource Center) 200 పడకల ఆసుపత్రి వద్ద గురువారం ఆయన సెల్ఫీ తీసుకున్నారు. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న సీఎం జగన్‌ మాస్క్‌ ముఖానికి తగిలించుకుని కుర్చీలో కూర్చుని మరీ ఫొటోలు తీయించుకున్నారు.

పనిలోపనిగా ఎప్పటిలాగే టీడీపీపై నోరుపారేసుకున్నారు. మాజీసీఎం చంద్రబాబు (Chandrababu)పై ఆరోపణలు గుప్పించారు. 14 ఏళ్లు మఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. 978 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఒక్కపోర్టు గానీ, హార్బర్‌ గానీ నిర్మించారా? అని ప్రశ్నించారు. అయితే వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చాక నాలుగేళ్ల పాటు మిన్నకుండిపోయి తీరా ఎన్నికలు దగ్గర పడ్డాక పోర్టు శంకుస్థాపన అంటూ హడావుడి చేయడం గురించి చెప్పరేం అని మంత్రి వ్యాఖ్యలను విన్నవారు నోరెళ్లబెట్టుకున్నారు. జగన్‌ను విమర్శిస్తే సహించేదిలేదని మంత్రి సీదిరి హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి వార్నింగ్‌ ఇచ్చారు అప్పలరాజు.

Updated Date - 2023-04-20T19:14:33+05:30 IST