Pawan Kalyan: అవనిగడ్డలో పవన్ కల్యాణ్ సభకు పోలీసుల అడ్డంకులు

ABN , First Publish Date - 2023-10-01T18:18:52+05:30 IST

అవనిగడ్డలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వారాహి సభకు పోలీసుల (Police) అడ్డంకులు సృష్టించారు.

Pawan Kalyan: అవనిగడ్డలో పవన్ కల్యాణ్ సభకు పోలీసుల అడ్డంకులు

కృష్ణా: అవనిగడ్డలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వారాహి సభకు పోలీసుల (Police) అడ్డంకులు సృష్టించారు. సభా ప్రాంగణం నలుదిక్కుల పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి జనసేన కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సభా ప్రాంగణానికి రెండు కిలోమీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డంకులు సృష్టిస్తున్నారు. పోలీసుల తీరుపై జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రను పురస్కరించుకొని ర్యాలీలతో అవనిగడ్డ మోతెక్కుతోంది. అభిమానులకు సమాచారం ఇవ్వకుండా చెప్పిన సమయం కంటే ముందే పవన్ కల్యాణ్ అవనిగడ్డకు చేరుకున్నారు.

జనసేన తెలుగుదేశం జెండాలతో అవనిగడ్డ డిగ్రీ కళాశాల క్రీడా మైదానం కళకళలాడుతోంది. అవనిగడ్డలో వారాహి సభకు పవన్ కళ్యాణ్ వచ్చారు. రెగ్యులర్ వాహనంలో కాకుండా మరో వాహనంలో సభా స్థలికి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ చేరుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రెగ్యులర్ కార్ల కాన్వాయ్ బయలుదేరింది. అందులో పవన్ కళ్యాణ్ ఉన్నారనుకుని అభిమానులు అనుసరించారు. అవనిగడ్డకు రెండు శివార్లలో పోలీసులు బారికేడ్లను పెట్టారు. పోలీసులు ఆంక్షలు, ప్రభుత్వం అడ్డంకులు వల్లే పవన్ కళ్యాణ్ ముందే వచ్చినట్లు జనసేన నాయకులు భావిస్తున్నారు.

Updated Date - 2023-10-01T18:19:06+05:30 IST