Pawan Kalyan: జగన్‌పై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు.. సీఎం నొక్కని బటన్‌లు చెబుతానంటూ..

ABN , First Publish Date - 2023-07-14T20:02:36+05:30 IST

తణుకులో వారాహి విజయయాత్రలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై (AP CM JAGAN) విమర్శలు గుప్పించారు.

Pawan Kalyan: జగన్‌పై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు.. సీఎం నొక్కని బటన్‌లు చెబుతానంటూ..

పశ్చిమగోదావరి: తణుకులో వారాహి విజయయాత్రలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై (AP CM JAGAN) విమర్శలు గుప్పించారు.

"జగన్ కొంపలంటీస్తాడు. నేను గుండెలంటిస్తాను. భవన నిర్మాణ కార్మికులకు వచ్చే సెస్సును తినేసి వారికి అన్యాయం చేశాడు. సగటు మనిషి కష్టాలు నాకు తెలుసు. జగన్ బటన్ నొక్కాడు. నేను జగన్ నొక్కని బటన్‌లు చెబుతాను. చెత్త మీద గతంలో పన్ను లేదు. నువ్వు పన్ను వేశావు జగన్. నిత్యావసర వస్తువుల రేట్లను ప్రస్తావించిన పవన్.. 60 రూపాయల మద్యాన్ని 160 రూపాయలకు పెంచి మద్యపాన ప్రియుల పొట్టను కొట్టావు. వారి గుండెలు పిండేసావు. రేట్లు పెంచావు కాబట్టే, జనాలకు మొహం చూపించలేక పరదాలు కట్టుకుని తిరుగుతున్నావ్. తణుకు టీడీఆర్ స్కాంలో రూ. 309 కోట్లు డబ్బు కాజేశారు." అని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

"తణుకుకు చెందిన కవి దేవరకొండ బాల గంగాధర్ తిలక్ రాసిన మాటలే జనసేన ఆవిర్భావ మాటలు. నేను సైద్ధాంతిక బలంతో వచ్చాను. ఓటమి గెలుపు నాకు తెలీదు. ప్రయాణం చేయడమే తెలుసు. సూర్యుడు అస్తమించినా పర్వాలేదు. కవి లేకపోతే ఏమీ నడవదు. దూర్తుల సామ్రాజ్యంలో జనం హాహాకారాలు అంటూ కవిత్వం చెప్పిన పవన్. తణుకులో నన్నయ్య భట్టారక పీఠాన్ని ఎంతో కవులు సందర్శించారు"అని పవన్ అన్నారు.

రెండో విడత వారాహి విజయయాత్ర తణుకులో ముగిస్తున్నామని పవన్ తెలిపారు.

Updated Date - 2023-07-14T20:05:03+05:30 IST