Share News

AP News : మరోసారి గంగలో కలిసిన ఏపీ పరువు..!

ABN , First Publish Date - 2023-11-08T11:35:20+05:30 IST

ఏపీ పరువు మరోసారి గంగలో కలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో జారీ చేసిన సీఆర్డీఏ బాండ్స్ రిస్క్ అని క్రిసిల్ డౌన్ గ్రేడ్ చేసింది. రేటింగ్ నెగెటివ్ వాచ్ లిస్ట్ లో పెట్టింది. బీఎస్ఏ, డీఎస్ఆర్ఏ అకౌంట్స్‌లో రూ.525 కోట్లు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చెయ్యాల్సి ఉండగా చేయడం లేదని క్రిసెల్ వెల్లడించింది.

AP News : మరోసారి గంగలో కలిసిన ఏపీ పరువు..!

అమరావతి : ఏపీ పరువు మరోసారి గంగలో కలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో జారీ చేసిన సీఆర్డీఏ బాండ్స్ రిస్క్ అని క్రిసిల్ డౌన్ గ్రేడ్ చేసింది. రేటింగ్ నెగెటివ్ వాచ్ లిస్ట్ లో పెట్టింది. బీఎస్ఏ, డీఎస్ఆర్ఏ అకౌంట్స్‌లో రూ.525 కోట్లు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చెయ్యాల్సి ఉండగా చేయడం లేదని క్రిసెల్ వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం కేవలం 231 కోట్లే మెయింటెయిన్ చేస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిషిట్ 43 వేల కోట్లకి చేరినట్లు వెల్లడించారు. స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో అప్పు 42% చేరుకుందని .. అందుకే ఏపీసీఅర్‌డీఏ బాండ్స్ నెగెటివ్‌లో పెట్టామని క్రిసెల్ వెల్లడించింది.

టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో సీఆర్డీఏ బాండ్లు రూ.1300 కోట్లకి రిలీజ్ చేస్తే .. కేవలం గంటలోనే ఓవర్ సబ్‌స్క్రైబ్ అవడం విశేషం. ఆ వెంటనే 2000 కోట్లకి నాటి ప్రభుత్వం బాండ్స్ రిలీజ్ చేసింది. అప్పటికి దేశవ్యాప్తంగా ఉన్న మునిసిపల్ కార్పొరేషన్స్ అన్నీ కలిపి బాండ్స్ ద్వారా రైజ్ చేసింది సుమారు రూ.1800 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. చంద్రబాబు సర్కార్ కేవలం గంటలో 2000 కోట్లు బాండ్స్ జారీ చేసింది. అలాంటి పరిస్థితి నుంచి నేడు ఏపీ బాండ్స్ తో జాగ్రత్త అనే పరిస్థితికి జగన్ సర్కార్ తీసుకొచ్చింది. రేటింగును బీబీబీ ప్లస్‌కు క్రిసెల్ తగ్గించింది.

Updated Date - 2023-11-08T11:35:21+05:30 IST