K Viswanath: విశ్వనాథ్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: చంద్రబాబు

ABN , First Publish Date - 2023-02-05T17:33:52+05:30 IST

దర్శకుడు కె.విశ్వనాథ్‌ (K Viswanath) స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) చెప్పారు. ఈ రోజు విశ్వనాథ్‌ నివాసానికి చంద్రబాబు వెళ్లారు.

K Viswanath: విశ్వనాథ్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: చంద్రబాబు

హైదరాబాద్‌: దర్శకుడు కె.విశ్వనాథ్‌ (K Viswanath) స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) చెప్పారు. ఈ రోజు విశ్వనాథ్‌ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. విశ్వనాథ్‌ కుటుంబీకులను పరామర్శించి ధైర్యం చెప్పారు. విశ్వనాథ్ సమాజానికి అవసరమైన ఆణిముత్యాల్లాంటి సినిమాలు అందించారని చంద్రబాబు కొనియాడారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథ్.. అపోలో ఆస్పత్రి (Apollo Hospital)లో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తిపేరు కాశీనాధుని విశ్వనాథ్‌.(K. Viswanath passed away) గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెదపులివర్రు గ్రామం ఆయన స్వస్థలం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాధుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్‌ జన్మించారు. కె.విశ్వనాథ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.

కాసాని జ్ఞానేశ్వర్ నివాసానికి చంద్రబాబు

టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) నివాసానికి చంద్రబాబు వెళ్లారు. ఇటీవల కాసాని జ్ఞానేశ్వర్‌ తల్లి కాసాని కౌసల్య(93) మృతి చెందారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కౌసల్య(93) మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. కౌసల్య 2007 నుంచి 2012 వరకు బాచుపల్లి సర్పంచ్‌గా సేవలందించారు. రాష్ట్ర టీడీపీ నేతలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు కౌసల్య మృతిపట్ల సంతాపం తెలిపారు.

Updated Date - 2023-02-05T18:54:18+05:30 IST