Share News

Nellore: రేపు పీఎస్ఎల్వీ సీ-58 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్దం..

ABN , Publish Date - Dec 31 , 2023 | 09:13 AM

నెల్లూరు జిల్లా: షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి రేపు (సోమవారం) పీఎస్ఎల్వీ సీ-58 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్దమైంది. ఆదివారం ఉదయం 8.10 గంటలకు కౌంటడౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్వీ సీ-58 నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకుపోనుంది.

Nellore: రేపు పీఎస్ఎల్వీ సీ-58 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్దం..

నెల్లూరు జిల్లా: షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి రేపు (సోమవారం) పీఎస్ఎల్వీ సీ-58 (PSLV C-58) రాకెట్ ప్రయోగానికి (Rocket launch) సర్వం సిద్దమైంది. ఆదివారం ఉదయం 8.10 గంటలకు కౌంటడౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్వీ సీ-58 నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకుపోనుంది. కౌంట్ డౌన్ ప్రక్రియ 25 గంటల పాటు కొనసాగనుంది. 418 కిలోలు బరువు ఉండే ఎక్స్‌ఫోశాట్, కేరళ యూనివర్శిటీ విద్యార్ధులు రూపొందించిన విఐవై (VIY) నానాశాట్‌లని శాస్త్రవేత్తలు రోదసీలోకి పంపనున్నారు. భూ ఉపరితలానికి 650 కి.మీ ఎత్తులోని వృత్తాకార కక్ష్యలోకి శాటిలైట్లను పంపేలా డిజైన్‌ చేశారు.

అంతరిక్ష రహస్యాల కోసం ఎక్స్‌ఫోశాట్ (EXPO SAT) రూపకల్పన. టెలిస్కోప్‌లా పనిచేస్తూ ఖగోళంలో బ్లాక్ హోల్స్, పాలపుంతలు, ఎక్స్ రే కిరణాలపై పరిశోధనకి ఉపయోగపడుతుంది. ఎక్స్‌ఫోశాట్ జీవితకాలం అయిదేళ్లు. ఇస్రోకి గెలుపు గుర్రాలుగా పీఎస్ఎల్వీ రాకెట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 59 పీఎస్ఎల్వీ రాకెట్లను ప్రయోగించారు. సోమవారం పీఎస్ఎల్వీ సిరీస్‌లో 60వ ప్రయోగం చేస్తున్నారు.

Updated Date - Dec 31 , 2023 | 09:13 AM