Nellore వైసీపీ అధిష్టానం తీరుపై మేకపాటి హాట్ కామెంట్స్..

ABN , First Publish Date - 2023-03-24T15:35:35+05:30 IST

నెల్లూరు: వైసీపీ అధిష్టానం (YCP Leadership) తీరుపై ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) హాట్ కామెంట్స్ (Hot comments) చేశారు.

Nellore వైసీపీ అధిష్టానం తీరుపై మేకపాటి హాట్ కామెంట్స్..

నెల్లూరు: వైసీపీ అధిష్టానం (YCP Leadership) తీరుపై ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) హాట్ కామెంట్స్ (Hot comments) చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉదయగిరి వైసీపీలో నాలుగు వర్గాలుగా విభజించి.. అధిష్టానం పెద్దలు పాలించే ప్రయత్నం చేశారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అధిష్టానంలో పలికే నాధుడే లేడని, సచివాలయంలో ఏ అధికారిని కదిలించినా నిధులు లేవని సమాధానం చెబుతున్నారని అన్నారు. బటన్ నొక్కితే సీఎం జగన్‌ (CM Jagan)కే పేరని.. నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తేనే ఎమ్మెల్యేకు మంచి పేరు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో అందరి ఎమ్మెల్యేల పరిస్థితి ఇలాగే ఉందని... తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో పార్టీ తీవ్ర సమస్యల్లో పడుతుందని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వైసీపీ అధిష్టానం చెప్పిన వెంకటరమణకే ఎమ్మెల్సీ ఓటు వేసి గెలిపించానన్నారు. ‘టిక్కెట్టు ఇస్తే గెలిచి చూపిస్తా... ఇవ్వకపోతే నా దారి నేను చూసుకుంటా’... అంటూ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో తానంటే గిట్టని వాళ్లు తనపై దుష్ప్రచారం చేసి, మరింత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

Updated Date - 2023-03-24T15:35:35+05:30 IST