Nellore: మీ ఓటు వద్దు తల్లి: ఎమ్మెల్యే మేకపాటి

ABN , First Publish Date - 2023-05-26T08:49:30+05:30 IST

నెల్లూరు జిల్లా: ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి సొంత మండలంలోనే గడప గడపకి కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, సింగనపల్లిలో ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ...

Nellore: మీ ఓటు వద్దు తల్లి: ఎమ్మెల్యే మేకపాటి

నెల్లూరు జిల్లా: ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి (Mekapati Vikram Reddy)కి సొంత మండలంలోనే గడప గడప (Gadapa Gadapa)కు కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, సింగనపల్లిలో ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ మోసం చేశారంటూ ఎమ్మెల్యే మేకపాటిపై ఎస్సీ కాలనీ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్నకు ఓటు వేసినందుకు నాలుగేళ్లుగా నమ్మించి మోసం చేశారని... ఇదేనా నమ్మకమంటే అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో విసిగిపోయిన ఎమ్మెల్యే.. ‘మీ ఓటు కోసం రాలేదు... మీ ఓటు వద్దు తల్లి...’ అంటూ ఎమ్మెల్యే మేకపాటి వెళ్లిపోయారు.నేతలు ఎంతగా సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో విసిగిపోయిన ఎమ్మెల్యే.. ‘మీ ఓటు కోసం రాలేదు... మీ ఓటు వద్దు తల్లి...’ అంటూ ఎమ్మెల్యే మేకపాటి వెళ్లిపోయారు.

Updated Date - 2023-05-26T08:56:12+05:30 IST